విజయవాడ అతలాకుతలం అవుతోంది.  కుంభవృష్టి వర్షాలతో విజయవాడ మొత్తం విలవిలలాడిపోతోంది. విజయవాడ మొత్తం వరద నీటిలో చిక్కుకుపోయింది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు అంత జలమయమయ్యాయి. చెరువులను తలపిస్తున్నాయి. గత మూడు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో బెజవాడ వాసులకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. కృష్ణా నదిలోకి భారీగా నీరు చేరడంతో భవానీ పురానికి వరద ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే కొన్ని కాలనీలు నీటిలో మునిగిపోయాయి. 


ప్రకాశం బ్యారేజ్ ఎగువ వాటర్ పున్నమి ఘాట్ వద్ద రోడ్డు మీదకి నీరు చేరుతున్నాయి. సహాయ సిబ్బంది ఇసుక బస్తాలతో నీటిని ఆపే ప్రయత్నాలు చేస్తున్నారు. కృష్ణానది మహోగ్రరూపంతో కరకట్ట వాసులు భయభయంగా కాలం గడుపుతున్నారు. మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమం కూడా నీట మునిగింది. అటు కృష్ణానదికి వరద ఉధృతి కొనసాగుతూ ఉండడంతో ప్రకాశం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరికను జారీచేశారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద ప్రస్తుతం ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 11,39,351 క్యూసెక్కులుగా నమోదు అయ్యింది.

అయితే... తాజాగా విజయవాడ మరో ముప్పు వచ్చింది వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. విజయవాడ నగరానికి కి అమావాస్య గండం వచ్చిందని అంటున్నారు. ఇవాళ అమావాస్య ఉన్న కారణంగా సముద్రం...పోటు ముద ఉంటుందని చెబుతున్నారు.  సముద్రం పోటు మీదుంటే... వరదను తనలోకి వరద నీటిని అస్సలు కలుపుకోదని సమాచారం.

 
అయితే... వరద జలాలు సముద్రంలో కలవకుంటే... విజయవాడ  కు మ రింత ప్రమాదం ఎదురు అవుతుంది. ఎగువ నుంచి భారీగా వరద వస్తోంది. దీంతో విజయవాడలో మరింత ప్రమాదం ఏర్పడుతోంది.. ఇవాళ రా త్రి 12 గంటల తర్వాత.. అమావాస్య గడియలు ముగియనున్నాయని పండితులు చెబుతున్నారు. ఆ తర్వాతే సముద్రం.... కూల్‌ అవుతుందట. ఇక అప్ప టి దాకా వేచి చూడాలని చెబుతున్నారు వాతావరణ శాఖ అధికారులు.


మరింత సమాచారం తెలుసుకోండి: