కేసీఆర్ తెలంగాణను ఉద్యమం తరహాలోనే అభివృద్ధి చేశారు. కానీ ఏ నినాదాలతో అయితే తెలంగాణ సాధించుకున్నమో ఆ నినాదాల్లో కేవలం నీళ్లు మాత్రమే పదేళ్లలో నెరవేర్చగలిగారు. అయితే లక్ష కోట్ల రూపాయలతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రధానమైన మేడిగడ్డ కుంగిపోయి కేసీఆర్ వైఫల్యాలను బయట పెట్టింది. అప్పటి నుంచి కేసీఆర్ కుంగుబాటు మొదలైంది. గత రెండు ఎన్నికల్లో ప్రదర్శించిన దూకుడు 2023 ఎన్నికల్లో కనిపించలేదు.


ఇదే సమయలో టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి తన దైన శైలిలో ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఆకట్టుకునే ప్రసంగాలు చేశారు.  దీంతో పాటు ఆరు గ్యారంటీలు కాంగ్రెస్ ను అందలం ఎక్కించాయి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేసీఆర్ సైలెంట్ అయ్యారు. అయితే ఇందుకు వేర్వేరు కారణాలు ఉన్నాయి. కానీ బీఆర్ఎస్ ఎక్కడా తగ్గేదెలేఅన్నట్లు వ్యవహరిస్తోంది. అదే దూకుడు కొనసాగిస్తోంది. ఇదే బీఆర్ఎస్కు పెద్ద ప్లాస్ పాయింట్. అయితే అధికారంలోకి వచ్చినా కూడా రేవంత్ ప్రతిపక్ష పాత్ర తరహాలోనే దూకుడు కొనసాగిస్తున్నారు. దీంతో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య హీట్ తగ్గడం లేదు.


ఇక కేసీఆర్ ఇప్ఉపడు మళ్లీ ప్రజల్లోకి రాబోతున్నట్లు బీఆర్ఎస్ అనుకూల మీడియా పెద్ద పెద్ద శీర్షికలతో కథనాలు రాస్తుంది. ఛానెళ్లలో కథనాలు ప్రసారం చేస్తోంది. కేసీఆర్ ఎన్నికల తర్వాత సైలెంట్ అయ్యారు. తొమ్మిది నెలల తర్వాత మళ్లీ  యాక్టివ్ కాబోతున్నారు. కేసీఆర్ రాజకీయాల్లో ఆరితేరిన నేత. ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో ఆయనకు బాగా తెలుసు. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసిన నేత.


ఇదిలా ఉండగా ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో భారీ వ్యతిరేకత లేదు. ఎక్కడ రోడ్డెక్కి ధర్నాలు చేయడం లేదు. అసంతృప్తి ఉన్నా అది ఇంకా తీవ్ర రూపం దాల్చలేదు. లోక్ సభ ఎన్నికల్లోను ఇదే తరహా ప్రచారం చేసినా.. బీఆర్ఎస్ ఒక్కస్థానం కూడా గెలవలేదు. ఈ విషయం తెలిసే కేసీఆర్ సైలెంట్ గా ఉన్నారు. ప్రస్తుతం ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత లేదంటే.. కేసీఆర్ జనంలోకి వచ్చినా పెద్దగా ప్రయోజనం ఉండదు అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: