వైసీపీలో సంక్షోభం బంగాళాఖాతంలో వాయుగుండం మాదిరగా కొనసాతుతోంది. తుపాన్‌కు ముందు సంకేతాలు ఉంటాయి. వైసీపీ లో మాత్రం ఆ జాడలు కనిపించడం లేదు. మొన్నటికి మొన్న ఇద్దరు రాజ్యసభ ఎంపీలు చెప్పా పెట్టకుండా సైలెంట్ గా పార్టీకి గుడ్ బై చెప్పేశారు. వీటితో పాటు తమ ఎంపీ పదవులకు రాజీనామాలు చేశారు.


ఇక ఎమ్మెల్సీల రాజీనామాల పర్వం కొనసాగుతూనే ఉంది. పోతుల సునీత రాజీనామాతో మొదలైన ఈ పర్వం ఇప్పటికే ముగ్గురికి చేరింది. ఇది ఇప్పట్లో ఆగేలా లేదని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే దానికి ఒక మంచి ముహూర్తాన్ని సెట్ చేశారు ఉంచారనే ప్రచారం నడుస్తోంది. జగన్  ఈనెల 4న యూకే పర్యటనకు వెళ్లనున్నారు. ఈసారి ఏకంగా 20 రోజుల పాటు లండన్ లో ఉండబోతున్నారు.


ఈ సుదీర్ఘ సమయంలో వైసీపీలో పెను సంక్షోభాన్ని తీసుకువచ్చే భారీ స్కెచ్ రెడీ చేసినట్లు అంటున్నారు. ప్రస్తుతానికి రాజ్యసభ సభ్యుల నుంచి ఏ విధమైన బెడద లేకపోయినా శాసన మండలిలో మాత్రం భారీ కుదుపు తప్పదని అంటున్నారు. శాసన మండలిలో వైసీపీకి 39 మంది సభ్యుల బలం ఉంది. దాన్ని ఎంత వీలు అయితే అంతకు తగ్గించాలి అన్నది ఒక మాస్టర్ ప్లాన్ తో వైసీపీ ప్రత్యర్థులు ముందుకు సాగుతున్నారు.


అలా చూసుకుంటే కనీసం ఒక ఇరవై మంది ఎమ్మెల్సీలు వరకు గోడ దూకే అవకాశం ఉందని అంటున్నారు. వీరంతా తమ పదవులకు రాజీనామాలు చేసి కూటమిలోకి చేరిపోతారా లేదా అనేది తెలియరావడం లేదు. అక్కడ అదే ఎమ్మెల్సీ పదవి దక్కుతుందని హామీ ఉండటంతో వెంటనే వారు రాజీనామాలు చేసేందుకు సిద్ధం అవుతున్నారు. అలా కాదని నామినేటేడ్ పదవులు ఇస్తామని చెబితే దానికి అంగీకరించిన వారు కొంతమంది వైసీపీకి బై చెబుతున్నారు.మ


ఇక 2026 నాటికి ఏపీ అసెంబ్లీలో మరో 50 సీట్లు పెరుగుతాయి కాబట్టి కాబట్టి వారిలో అడ్జెస్ట్ చేస్తామని కూటమి పెద్దలు ఇచ్చే హామీలను తీసుకొని రాజీనామాలకు ముందుకు వచ్చే వారు ఉన్నారు. మొత్తానికి వైసీపీ ఓటమికి కారణం ఘోర ఓటమినే చెబుతున్నారు వారంతా. ఇదే జరిగితే టీడీపీకి ఆగస్టు సంక్షోభం మాదిరిగా వైసీపీకి సెప్టెంబరు చరిత్రలో మిగిలిపోయే అధ్యాయంలా నిలవనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: