అమరావతి అంటేనే టీడీపీ అధినేత చంద్రబాబు గుర్తుకు వస్తారు. అమరావతి ప్రజలకు బాబుకు ఒక ప్రత్యేకమైన అభిమానం ఉన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. 2015 సంవత్సరం నుంచి అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధాని అని, ఆ కలను సాకారం చేయాలని ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే గత రెండు మూడు రోజులుగా పడుతున్న వర్షాలకు విజయవాడ జలమయం అయితే అమరావతి లోను నీళ్లు పొంగిపొర్లుతున్నాయి.

అయితే ఈ విషయంపై అమరావతి మునిగింది అంటూ సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేస్తూ వైరల్ గా మారుస్తున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు ఫైర్ అయ్యారు. "అమరావతి మునిగింది అంటూ ఇలా తప్పుడు ప్రచారం చేస్తారా?" అంటూ మండిపడ్డారు. మరోవైపు "అమరావతి మునిగిపోయింది ఇంకా మీరేమీ రా రాజధాని కడతారు" అంటూ చేసిన వైసీపీ కామెంట్స్ పై బాబు ధ్వజమెత్తారు. "న్యూస్ నువ్వు పుట్టించి దేశం అంతటా వ్యాప్తి చేయడం సబబు కాదు" అంటూ చంద్రబాబు అన్నారు.

"తప్పుడు వార్తలు రాస్తే మాత్రం తగిన ఆధారాలు చూపించాలి. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్లు ఆధారాలు లేకుండా తప్పుడు ప్రచారం చేసే మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే  లేదు" అని చంద్రబాబు ఫైర్ అయిపోయారు.  వాస్తవానికి అమరావతి నేల మంచిది అన్నది ఒక మాట. పైగా కొండ వాగు పక్కనే ఉంది. నేల అడుగు పొరలలో శాండ్‌ లూస్ గా ఉంటుంది. దీంతో నిర్మాణానికి ఎక్కువ ఖర్చవుతుందని నిపుణుల అంచనా. అయితే మరోవైపు రాజధాని నిర్మాణానికి కావలసిన భూమి మరి ఎక్కడా లేకపోవడంతోనే ఆ ప్రాంతంలో రాజధాని నిర్మాణం ఏర్పాటుకు ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రజలకు కూడా రాజధాని కావాలి కదా మరి ఈ దశలో ఇంకా ఏమీ కాకముందే అమరావతి మునిగింది అని రాస్తే ఎలా అంటూ చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి విషయంలో ఎవరైనా సరే చెడు ప్రచారం చేస్తే మాత్రం ఊరుకోను అంటూ చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: