చంద్రబాబు నాయుడు వయస్సు ప్రస్తుతం 74 సంవత్సరాలు అనే సంగతి తెలిసిందే. 74 సంవత్సరాల వయస్సులో నాలుగోసారి సీఎం అయిన చంద్రబాబు నాయుడు కొన్ని విషయాల్లో విమర్శలు ఎదుర్కొన్నా ప్రజలు నిజంగా కష్టాల్లో ఉన్న సమయంలో సరైన విధంగా స్పందించి ప్రజల ప్రశంసలు అందుకుంటున్నారు. ఏపీలోని పలు గ్రామాల ప్రజలు జల దిగ్బంధంలో ఉండాల్సిన పరిస్థితి రావడంతో వరద బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగింది.
 
వర్షాలు కురుస్తున్న ప్రదేశాల్లో అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. చంద్రబాబు జేసీబీపై ఎక్కి ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నారు. ఈ విషయంలో చంద్రబాబు నాయుడును పార్టీలకు అతీతంగా మెచ్చుకోవాల్సిన అవసరం అయితే ఉందని చెప్పవచ్చు. చంద్రబాబు అంత కష్టపడుతూ ఉండటంతో అధికారులు సైతం కష్టపడాల్సిన పరిస్థితి నెలకొంది.
 
చంద్రబాబు జాగారం చేసి మీటింగ్స్, కాన్ఫరెన్స్ లతో ప్రశంసలు అందుకుంటున్నారు. చంద్రబాబుకు జగన్ కు తేడా ఇదేనంటూ కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. బాధితులకు చంద్రబాబు మనో ధైర్యాన్ని ఇస్తూ ముందుకు సాగుతున్నారు. గ్రౌండ్ లెవెల్ లో ప్రజలకు చేరువై ప్రజలకు భరోసా ఇస్తే మాత్రమే ప్రజల మెప్పు పొందే అవకాశాలు అయితే ఉంటాయి.
 
ఈ విషయంలో బాబును ఎంత మెచ్చుకున్నా తక్కువేనని చెప్పడంలో ఎలాంటి సందేహం అయితే అవసరం లేదు. సహాయక చర్యలు పకడ్బందీగా జరిగేలా కీలక నిర్ణయాలు తీసుకుంటూ చంద్రబాబు ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. తన విజన్ తో చంద్రబాబు క్లిష్ట సమయాల్లో సరైన విధంగా స్పందిస్తూ ప్రజల ప్రశంసలు అందుకుంటున్నారు.  ప్రజలకు పాల ప్యాకెట్లు సైతం పంపిణీ చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే బాగుంటుంది. పాల ప్యాకెట్లు పంపిణీ చేయకపోవడం వల్ల పసిపిల్లలు ఉన్న తల్లీదండ్రులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న పరిస్థితి నెలకొందని సమాచారం అందుతోంది. భారీ వర్షాల వల్ల తెలుగు రాష్ట్రాల్లోని పలు రైళ్లు రద్దు అయ్యాయని తెలుస్తోంది.






మరింత సమాచారం తెలుసుకోండి: