* కరకట్టపై తన ఇంటిని కాపాడుకునేందుకు బుడమేరు గేట్లు ఎత్తివేత

* బాబు పబ్లిసిటీ తప్పా.. పనులు సరిగ్గా జరగట్లేదంటూ జగన్ విమర్శలు..

* చుట్టం చూపుగా వస్తే ఏం తెలుస్తుంది అంటూ జగన్ వ్యాఖ్యలు  పై టీడీపీ కౌంటర్.


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి.. వరదల తాకిడికి విజయవాడ నగరం నీట మునిగింది..గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి..ఈ భారీ వర్ష తాకిడికి నదులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి..ఎన్నడూ లేని విధంగా కృష్ణా నది ఉగ్రరూపం దాల్చింది..ఇదివరకు ఎప్పుడూ లేనంతగా వరద నీటితో కృష్ణానది జోరుగా ప్రవహిస్తుంది.చాలా ప్రాంతాలు వరద నీటిలో మునిగిపోయాయి.. రాష్ట్ర ప్రభుత్వం వరద నీటిలో చిక్కుకున్న వారిని రక్షించడం కోసం ఎన్డిఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించింది..అనేక ప్రాంతాల్లో పీకల్లోతు నీరు నిలిచివుంది. మరికొన్ని ప్రాంతాల్లో ఏకంగా విద్యుత్ స్తంభాలు నీట మునిగిపోయాయి.ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వరద సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. వరద సహాయక చర్యల్లో అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్నారు..అర్ద రాత్రి అయిన సరే సీఎం చంద్రబాబు అధికార యంత్రాంగంతో జోరుగా పర్యటిస్తున్నారు…వరదలో చిక్కుకొన్న వారిని రక్షించేందుకు ప్రభుత్వ మంత్రులు, ఎమ్మెల్యే లు విస్తృతంగా పర్యవేక్షిస్తున్నారు.. సహాయక చర్యల్లో ఎలాంటి జాప్యం జరగకుండా చూసుకుంటున్నారు.

అయితే ప్రతి పక్ష వైసీపీ నేతలు వరదల సహాయక చర్యల్లో లోపాలు వున్నాయి అంటూ టీడీపీని, సీఎం చంద్రబాబుని తీవ్రంగా విమర్శిస్తున్నారు.. సోషల్ మీడియాలో విరుచుకుపడే వైసీపీ నేతలు సహాయక చర్యల్లో ఎక్కడా కనిపించలేదు.. నేతల వరకు ఎందుకు వైసీపీ అధినేత జగన్ సైతం ఏదో చుట్టం చూపుగా వచ్చి బాధితులను పరామర్శించారు అని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు...అయితే సహాయక చర్యలను విస్తృతంగా పర్యటిస్తున్న సీఎం చంద్రబాబుపై జగన్ విమర్శల వర్షం కురిపించారు..తమ ప్రభుత్వంలో ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు వాలంటీర్ వ్యవస్థ ద్వారా భాధితులను ఆదుకున్నామని జగన్ తెలిపారు..గతంలో వరదలు, తుఫాన్లు వచ్చినా గ్రామ, వార్డ్ స్థాయిలో వాలంటీర్ సహాయ సహకారాల వల్ల ఎలాంటి ఫిర్యాదులు లేకుండా చూసాం. విపత్తులకు ముందే పునరావస కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజలను తరిలించి ప్రతి కుటుంబానికి రెండు వేలు సహాయం అందించామని ఆయన గుర్తు చేసారు..విజయవాడ వరద బీభత్సం ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమేనని జగన్ ద్వజమెత్తారు.బుడమేరు గేట్లు ఎత్తి సీఎం చంద్రబాబు కరకట్టపై తన ఇంటిలోకి నీరు వెళ్లకుండా చేసి విజయవాడను ముంచేసారు అని జగన్ చంద్రబాబుని విమర్శించారు.అధికార యంత్రాంగాన్ని గాలికి వదిలేసారు. సహాయక చర్యలు సరిగ్గా అమలు కావటంలేదు.. ప్రభుత్వ పెద్దలంతా మెద్దు నిద్రపోతున్నారా అని జగన్ తీవ్రంగా విమర్శించారు..

మరింత సమాచారం తెలుసుకోండి: