జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు? ఏం చేస్తున్నారు? అనే ప్రశ్నకు జన సైనికుల నుంచి సరైన సమాధానం దొరకడం లేదు. గుడ్లవల్లేరు కాలేజ్ ఘటన గురించి కానీ, విజయవాడ వరదల గురించి కానీ పవన్ మీడియా ముఖంగా ఎలాంటి కామెంట్లు చేయలేదు. ప్రజలకు అండగా నిలబడటానికి, భరోసా ఇవ్వడానికి సైతం పవన్ ప్రయత్నాలు చేయకపోవడం గమనార్హం.
 
పవన్ రాజకీయాలపై ఏపీ ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్రంలో ఏ ఘటన జరిగినా శరవేగంగా స్పందించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారనే ప్రశ్నకు సరైన సమాధానం దొరకడం లేదు. ప్రజలు గుక్కెడు నీళ్లు దొరక్క వరదల్లో కొట్టుకుపోతూ ఇబ్బందులు పడుతున్న సమయంలో పవన్ రియాక్ట్ అవుతున్న తీరుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
 
ఇప్పటికైనా పవన్ ప్రజల్లోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కొంతమంది అయితే పవన్ దేశంలోనే ఉన్నారా అంటూ కామెంట్లు చేస్తున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో సులువుగానే అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ కనీసం తనపై వస్తున్న విమర్శల గురించైనా స్పందించాల్సి ఉందని చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం డిప్యూటీ సీఎం కూడా అనే సంగతి తెలిసిందే.
 
భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో భవిష్యత్తులో సైతం సక్సెస్ కావాలంటే ఇలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడితే మంచిదని చెప్పడంలో సందేహం అయితే అవసరం లేదు. పవన్ కళ్యాణ్ ప్రజలను నిర్లక్ష్యం చేస్తే మాత్రం ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ త్వరలో సినిమాలపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టనున్నారని సమాచారం అందుతోంది. పవన్ రెమ్యునరేషన్ సైతం ఒకింత భారీ స్థాయిలో ఉందని తెలుస్తోంది. ప్రజలు కష్టాల్లో ఉన్న సమయంలో పవన్ ఈ తరహా విమర్శలు రాకుండా భవిష్యత్తులో జాగ్రత్త పడతారేమో చూడాల్సి ఉంది.
 


మరింత సమాచారం తెలుసుకోండి: