నియోజకవర్గాల పునర్ విభజన జరగడంతో సత్యనారాయణమూర్తి పెందుర్తికి మారారు. 2009లో అక్కడ ఆయన ఓడిపోయిన 2014లో గెలిచి 2019లో ఓడిపోయారు. మొన్నటి ఎన్నికలలో పొత్తులో భాగంగా పెందుర్తి సీటును జనసేన కేటాయించారు. చివరి వరకు కూడా సత్యనారాయణమూర్తికి సీటు దక్కుతుందా లేదా అన్న సందేహం నెలకొంది. ఆయనకు పెందుర్తి నియోజకవర్గంలో గట్టిపట్టు ఉంది. పెందుర్తిలో 2009లో సత్యనారాయణమూర్తి పై ప్రజారాజ్యం నుంచి విజయం సాధించిన పంచకర్ల రమేష్ బాబుకు జనసేన టిక్కెట్ దక్కింది. అయితే చివరిలో అనూహ్యంగా సత్యనారాయణ మూర్తిని మాడుగులకు షిఫ్ట్ చేశారు. ఆయన అక్కడ కూడా విజయం సాధించారు.
సత్యనారాయణ మూర్తి సొంత నియోజకవర్గ పెందుర్తి కావడంతో ఇక్కడ కూడా తన పట్టు నిలుపుకునేందుకు అధికారులు బదిలీలు .. పోలీసులు బదిలీల్లో తన మార్కులు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే స్థానిక ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబును కాదని నియోజకవర్గంలో కీలకమైన పెందుర్తి - పరవాడ సర్కిల్స్ కు తనకు కావలసిన వారికి పోస్టింగులు ఇప్పించుకున్నారని తెలుస్తోంది. ఇది సహజంగానే రమేష్ బాబుకు నచ్చలేదు. అందుకే రమేష్ బాబు తన నియోజకవర్గంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తన మాట చెల్లుబాటు కాకుండా వేరే నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే చెప్పినట్టు ఎలా చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే తన ఇద్దరు గన్మెన్లను ప్రభుత్వానికి కూడా సరెండర్ చేశారు. ఇప్పుడే ఈ విషయం మన విశాఖ జిల్లా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.