బెజవాడలో పరిస్థితులు చూస్తుంటే బాధగా ఉంది. కొన్ని వేల మంది ప్రజలు వరద నీటిలో చిక్కుకున్నారు. దీనావస్థలో ఉన్నారు. తాగునీరు కూడా అందుబాటులో లేదు. ఇవన్నీ చూశాక ఇక్కడి నుంచి వెళ్లాలని లేదు. నేను ఇక్కడే ఉంటాను. అందర్నీ సురక్షితంగా బయటకు తీసుకువచ్చి.. అన్ని కార్యక్రమాలు పూర్తయ్యే వరకు నేను అండగా ఉంటాను
ఇళ్లపై ఉన్న వారికి, అందరికీ భరోసా ఇస్తున్నా? ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తాను. పూర్తిగా వాళ్లను అన్ని విధాలుగా రక్షించే వరకు ఇక్కడే ఉంటాను. బాధితులకు కావాల్సిన నిత్యావసర సరకులు, తాగునీరు అందిస్తాం అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విజయవాడ వరదల్లో చిక్కుకున్న వారికి భరోసా కల్పించారు.
74 ఏళ్ల వయసులోను ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సోమవారం ఉదయం నాలుగు గంటల వరకు 14 గంటల పాటు చంద్రబాబు అవిశ్రాంతంగా పర్యటిస్తూనే ఉన్నారు. బాధితులను కలిసి భరోసా కల్పిస్తున్న తీరుపై సర్వత్రాప్రశంసలు కురుస్తున్నాయి. తన మంత్రి వర్గంలోని ఎవరిని ఆదేశించినా క్షేత్ర స్థాయిలో ఉండి సహాయక చర్యలు పరిష్కరించే అవకాశం ఉన్నా.. చంద్రబాబు తానే స్వయంగా రంగంలోకి దిగి భరోసా కల్పించడం విశేషం.
భారీ వర్షాల వల్ల విజయవాడ అతలాకుతలం అయింది. అనేక కాలనీలు జల దిగ్భందంలో మునిగిపోయాయి. సీఎం చంద్రబాబు పర్యవేక్షణలో అధికారులు, సహాయక బృందాలు బాధితులును సురక్షిత ప్రాంతాలకు చేరవేసే పనిని వేగవంతం చేశాయి. బుడమేరు వాగు పొంగడంతో విజయవాడలోని లోతట్టు ప్రాంతాలు సీంగ్ నగర్, రాజీవ్ నగర్, ప్రకాశ్ నగర్, పాయకాపురం జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి.
వరదలో తమ ఇళ్లలో ఉన్నవారికి తాగునీరు, ఆహారం ప్యాకెట్లను పంపిణీ చేశారు. చంద్రబాబు స్వయంగా అర్ధరాత్రి వరకు స్వంగా బోటుపై సింగ్ నగర్ లో పర్యటించారు. అందరికీ ఆహారం అందిందా అని ఆరా తీశారు. కొందరికీ ఆహారం పొట్టాలు, బిస్కెట్లు, వాటర్ బాటిళ్లను అందించారు. 14 గంటల పాటు ఇబ్రహీం పట్నం, ఫెర్రీ, జూపూడి, మూలపాడు ప్రాంతాల్లో పర్యటించి సోమవారం నాలుగు సమయంలో విజయవాడ కలెక్టరేట్ లో విశ్రాంతి తీసుకున్నారు.