* దివిసీమ వరద నష్టం తీర్చలేనిది
* దివిసీమ ఉప్పెనకు 47 ఏళ్ళు
* దివిసీమ ఉప్పెనతో 50 వేల మంది మృతి
* తీవ్రంగా నష్టపోయిన తెలుగు రాష్ట్రాలు
భారతదేశంలో వరదలు అలాగే వర్ష బీభత్సం చాలా సంఘటనల్లో జరుగుతున్నాయి. వర్షాకాలం వస్తే ఈ ప్రమాదాలు కేరళ నుంచి మొదలు పెడితే ఆంధ్రప్రదేశ్ వరకు.... ప్రతిసారి జరుగుతున్నాయి.అయితే... భారతదేశ చరిత్రలో కొన్ని సంఘటనలు గుర్తు చేసుకుంటే... అందరికీ కళ్ళల్లో నెత్తురే వస్తుంది. అలాంటి సంఘటనే దివిసీమ విలయం. ఈ దివిసీమ ఉప్పెన జరిగి దాదాపు 47 సంవత్సరాలు కావచ్చింది. అయినప్పటికీ ప్రజలు ఎవ్వరూ కూడా దీన్ని మర్చిపోవడం లేదు.ముఖ్యంగా దీని తాకిడి తెలుగు ప్రజలకు మాత్రమే... స్పష్టంగా ఎదురైంది.
ఈ దివిసీమ ఉప్పెన ప్రభావం కారణంగా దాదాపు 50 వేల మంది దేశవ్యాప్తంగా మరణించినట్లు లెక్కలు చెబుతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ప్రాణ నష్టం విపరీతంగా జరిగింది. 1977 సంవత్సరం నవంబర్ 19వ తేదీన ఈ ఉప్పెన...వచ్చింది. దీంతో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దివిసీమ ఉప్పెన భారత దేశ చరిత్రలోనే అత్యంత దారుణమైనది. చాలా విషాదకరమైనదని...చాలామంది చెబుతూ ఉంటారు.
1997 నవంబర్ మాసంలో... ఈ దివిసీమ ఉప్పెన ఎగిసి పడ్డప్పుడు... సముద్రం తాడిచెట్టు ఎత్తు పైకి వచ్చి ఎగిరి పడింది. దీంతో తీవ్రమైన తుఫాను ఏర్పడి భారీ వర్షాలు పడ్డాయి. ముఖ్యంగా ఈ దివిసీమ ఉప్పెన కారణంగా... సంగమేశ్వరం, దిండి, మూలపాలెం అలాగే నాలిలాంటి గ్రామాలైతే రూపు రేఖలు లేకుండా పోయాయి. గుట్టలు గుట్టలుగా శవాలు పడ్డాయి. అయితే దివిసీమ ఉప్పెన కారణంగా చాలామంది నష్టపోయిన... సంగతి మనందరికీ తెలిసిందే. అయితే దివిసీమ ఉప్పెన నెలకొన్న సమయంలో ప్రధానిగా ఇందిరాగాంధీ ఉండడం జరిగింది.
అప్పుడు ఆమె ఈ వరదల నేపథ్యంలో చాలా చురుగ్గా పనిచేశారు. తీవ్రంగా నష్టపోయిన ప్రజలను ప్రధాని ఇందిరాగాంధీ వచ్చి... ఆదుకోవడం జరిగింది. అదే సమయంలో ఎన్టీఆర్ లాంటి వారు... నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు ఫండింగ్ కూడా... అందరినీ అడిగారు. ఇక స్వచ్ఛంద సంస్థలు కూడా తమ వంతుగా ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఇక ఈ దివిసీమ ఉప్పెన కారణంగా... ఈ ఉప్పన బారిన చిట్టచివరి గ్రామంలో తుఫాను మృతుల స్మారకాన్ని కూడా నిర్మించడం జరిగింది.