-వరదలతో వణుకుతున్న తెలుగు ప్రజలు.
- నిరాశ్రయులైన లక్షలాది మంది పేదలు
- ప్రకృతిని నాశనం చేస్తే ఫలితమిదే.!


 ప్రకృతి మూడవ కన్ను తెరిస్తే  ప్రజలనేవారు మట్టి కొట్టుకపోతారు.  అలాంటి మనం ప్రతిరోజు, ప్రతిక్షణం పకృతిని పాడు చేస్తూనే ఉన్నాం. చివరికి ఆ ముప్పును మనకు మనమే తెచ్చుకుంటున్నాం. అలా గోదావరి  వరద నీరు కూడా ఈ ప్రకృతిలోని ప్రభావం వల్లే ప్రతిఏటా పెరుగుతూ వస్తోంది. దీంతో వరద దాటికి లక్షలాదిమంది ప్రజలు లక్షల ఎకరాల పంటలు పశుపక్ష్యాదులు నాశనమవుతున్నాయి. కోట్లాది రూపాయల నష్టం జరుగుతోంది. అయినా మానవుల్లో మార్పు రావడం లేదు.  గోదారమ్మ అంతటి ఉగ్రరూపం దాల్చడానికి కారణాలేంటి. గోదావరి వరదల వల్ల జరిగిన నష్టం ఏంటి ఆ వివరాలు ఏంటో చూద్దాం.

 గోదారమ్మ కన్నెర్ర :
 ప్రభుత్వాలు మారిన నేతలు మారిన గోదావరి పరివాహక ప్రజల పరిస్థితులు మాత్రం మారడం లేదు. గోదావరికి వరదలొస్తే ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని బ్రతకాల్సిందే. ఇప్పటికే ఎన్నోసార్లు వరదల వల్ల అల్లాడిపోయిన ప్రజలు  మరోసారి బిక్కుబిక్కుమంటూ భయం నీడన బ్రతుకుతున్నారు. గోదావరి వరద వల్ల ఇప్పటికే వేలాది గ్రామాలు నీటిలో మునిగాయి. ఇళ్లలోకి నీరు చేరిపోయి బయటకు వెళ్లాలంటే పడవలే దిక్కయ్యాయి. ఇక లంక గ్రామాల ప్రజల పరిస్థితి మాత్రం దారుణం. పాసర్లపూడి, అప్పనపల్లి, టేకి శెట్టి పాలెం, రాజోలు దీవి పూర్తిగా నీటిలో మునగడంతో ప్రజలు కనీసం ఫుడ్ లేక ఇక్కట్లు పడుతున్నారు. ఈ విధంగా ఎన్ని ప్రభుత్వాలు మారిన వరద కష్టాలు మాత్రం తీయడం లేదు. 1964 నుంచి మొదలు వరదలు వచ్చినప్పుడల్లా ఈ గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ బ్రతకాల్సిందే. గోదావరి ఉగ్రరూపం దాలిస్తే చాలు వీరి గుండెల్లో వణుకు పుడుతుంది. మహారాష్ట్రలోని త్రయంబకేశ్వర్ లో పుట్టిన గోదావరి అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది.


మొత్తం 1465 కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణంలో మానేరు, ఇంద్రావతి మంజీరా ప్రాణహిత, శబరి, కిన్నెరసాని, సీలేరు, వంటి ప్రధాన ఉపనదుల, పెద్దవాగుల ప్రవాహాలను కలుపుకొని దేశంలోని అతిపెద్ద నది పరివాహక ప్రాంతాలలో ఒకటిగా మారింది. ముఖ్యంగా కృష్ణా నదితో పోలిస్తే గోదావరి వరదల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఏపీలోని తూర్పుగోదావరి, కోనసీమ, అల్లూరి, ఏలూరు, పశ్చిమగోదావరి వరదల వల్ల  21,051 మంది తమ ఇళ్ళను ఖాళీ చేయాల్సి వచ్చింది ఇందులో వేలాది మంది పునరావసర కేంద్రాలకు తరలించారు. ఈ క్రమంలో ఎన్నో లక్షల ఎకరాల పంటలు నష్టమయ్యాయి. ముఖ్యంగా అనకాపల్లి, శ్రీకాకుళం, అల్లూరి, కోనసీమ, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, కృష్ణ, ఏలూరు, జిల్లాలలో ఎక్కువగా గోదావరి వరదల ప్రభావం ఉంటుంది. గోదావరి వరదలు వచ్చాయి అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతకాల్సిందే. ఇలా ఎన్నిసార్లు గోదావరి వరదలు వచ్చిన ప్రజలు నష్టపోతున్నారు తప్ప ప్రభుత్వ పాలనలో మార్పులు రావడం లేదు.  గోదావరి వరదల నుంచి ప్రజలను కాపాడే ప్రత్యామ్నాయ మార్గాలు మాత్రం ప్రభుత్వాలు వెతకడం లేదని చెప్పవచ్చు.

 నష్టాలు:
 ఈ వరదల కారణంగా ఇండ్లలో నీరు చేరడం ఒకెత్తయితే వరదలు తగ్గుముఖం పట్టిన తర్వాత ఇండలోకి, పంట పొలాల్లోకి చేరిన బురద తీయడం మరో ఎత్తు అవుతుంది. వంట నష్టంతో పాటు బురద నష్టమే ఎక్కువగా ఇబ్బంది పెడుతుందట.

 నివారణ చర్యలు:
ఇండియాలో వరదల నిర్వహణకు రాష్ట్ర కేంద్ర స్థాయిలో రెండు అంచెల వ్యవస్థ ఉంటుంది. ఇందులో 1945లో ఏర్పాటైన సెంట్రల్ వాటర్ కమిషన్ వరద నియంత్రణ డ్యాముల, నదుల పరిరక్షణ దేశవ్యాప్తంగా నీటి వనరుల  అభివృద్ధి అంతర్జాతీయ జన సంబంధాల బాధ్యతలను చూస్తుంది. సెంట్రల్ వాటర్ కమిషన్ 2022 ప్రకారం 5,334 పెద్ద డ్యాములు. వీటిలో 80% డ్యాములు 25 సంవత్సరాల పాతవి. పెద్ద డ్యాములో 227 డ్యాములు వందేళ్ళ పూర్వమే నిర్మించినవి. గడిచిన వందేళ్లలో  41 డ్యాములు వరద వల్ల విఫలమయ్యాయి. ఇక 2021లో ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య డ్యాం వైఫల్యంతో విపరీతమైన నష్టం జరిగింది. ఇలా వరదలను నివారించాలంటే ఆయా రాష్ట్రాలు డ్యాముల నిర్వహణ పటిష్టంగా చేయాలి. డ్యామ్ సేఫ్టీ ప్రోటోకాల్స్ పాటించాలి. సముద్ర, నది తీర ప్రాంతాల్లో వరదలను తగ్గించడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయాలో వాటిపై ముందుగా దృష్టి పెట్టి సమస్యను క్లియర్ చేయాలి. పాత డ్యాముల కట్టలు ఆధునికరించడం, రిజర్వాయర్ల సామర్థ్యం మెరుగుపరచడం వంటివి చేయడం వల్ల వరద ప్రభావాన్ని తగ్గించవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: