గత కొద్ది రోజుల నుంచి భారీ వర్షాలకు ఎగువ ప్రాంతాల నుంచి దిగువ ప్రాంతాలకు వరద నీరు చేరుకోవడంతో రెండు తెలుగు రాష్ట్రాలలోని పలు ప్రాంతాలలో వరద నీటితో మునిగిపోతున్నాయి. గతంలో ఎన్నడు లేని విధంగా వరదనీరు రావడంతో చాలా ఏరియాలలో ప్రజలు ఇబ్బందులు పడడమే కాకుండా ఇంట్లో సామాన్లు వరద నీటిలో కొట్టుకొని పోతున్నాయి. దీంతో ప్రజలు ఉండడానికి ఇల్లు తినడానికి తిండి తాగడానికి నీరు లేకుండా ఏర్పడిన పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా అమరావతి ప్రాంతంలోని ఇలా ఎక్కువగా జరగడంతో ఏపీ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.


ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలలోని వరదలు నేర్పద్యంలో చాలామంది వ్యాపారవేత్తలు సినీ ప్రముఖులు రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున సీఎం రిలీఫ్ ఫండ్కు విరాళాలు కూడా అందించారట. ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి రెండు తెలుగు రాష్ట్రాలకు ఒక రాష్ట్రానికి కోటి రూపాయలు చొప్పున రెండు కోట్ల రూపాయలను హెరిటేజ్ సంస్థ నుంచి అందించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు అధికారికంగా ట్విట్టర్ ఖాతా నుంచి నారా భువనేశ్వరి ఒక పోస్ట్ ని షేర్ చేసింది.


అలాగే భువనేశ్వరి మాట్లాడుతూ కష్ట సమయంలో ప్రజలకు అండగా నిలబడాలి బాధితులను ఆదుకోవాలి మనం వారికి చేసే అతిపెద్ద సహాయం కూడా ఇదే అంటూ ఆమె తెలియజేసింది. అలాగే రెండు తెలుగు రాష్ట్రాలలోని వచ్చిన వరదలు చాలామంది జీవితాల పైన తీవ్రమైన ప్రభావం చూపిస్తున్నాయంటూ తెలిపింది. వరద నీటిలో చిక్కుకొని చాలామంది ఇబ్బంది పడుతున్నారు.. కేవలం మేము చేసే ఈ సహకారం సాయం వారి జీవితాల పైన కాస్తయిన ప్రభావం చూపిస్తుందని భావిస్తున్నాము అందుకే రెండు తెలుగు రాష్ట్రాలలోని సీఎం సహాయ నిధి కూడా ఈ విరాళాన్ని ప్రకటించాము అంటూ భువనేశ్వరి తెలియజేసింది. రెండు తెలుగు రాష్ట్రాలలోని జరిగేటువంటి ఎలాంటి కార్యక్రమాలకైనా సరే తమ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: