తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో విపరీతంగా వర్షాలు కురిసిన నేపథ్యంలో... ఇటు ఖమ్మం జిల్లా అటు విజయవాడ మహానగరం వరదలకు... అల్లాడిపోతుంది. ఖమ్మం జిల్లా ప్రజలు కూడా చాలా దారుణంగా నష్టపోయారు. కానీ కృష్ణా నది పక్కన ఉన్న నేపథ్యంలో విజయవాడ మహానగరం పూర్తిగా మునిగిపోయింది అని చెప్పవచ్చు. అయితే... విజయవాడ ను వరదలు ఆదివారం రోజున ముంచెత్తాయి. దీంతో వెంటనే అలెర్ట్ అయినా నారా చంద్రబాబు నాయుడు... ఆయనే స్వయంగా రంగంలోకి దిగారు.
75 సంవత్సరాల వరకు ఉన్న చంద్రబాబు నాయుడు... వరదల్లో నడుచుకుంటూ వెళ్లారు. బోట్లు తీసుకువచ్చి ప్రతి ఒక్కరికి సహాయం చేసే ప్రయత్నం చేశారు. ఆదివారం రోజున దాదాపు ఆయన నిద్రపోలేదు. అర్ధరాత్రి 4 గంటల వరకు వరద బాధితులను కాపాడే ప్రయత్నం దగ్గరుండి చేశారు సీఎం చంద్రబాబు నాయుడు. అయితే అలాంటి నారా చంద్రబాబు నాయుడు పైన రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
కృష్ణాజిల్లా లో వరదలను ముందుగా పసిగట్ట లేదని ఏపీ ప్రభుత్వం పై పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి. తమ ప్రభుత్వం చాలా దూకుడుగా వ్యవహరించిందన్నారు. అందుకే విజయవాడ కంటే ఖమ్మం కు నష్టం తక్కువగా జరిగిందని కూడా ఆయన తెలిపారు. అయితే ఈ వ్యాఖ్యలను వైసీపీ సోషల్ మీడియా బాగా వాడుకుంటుంది. గురువునే శిష్యుడు వెన్నుపోటు పొడిచాడని రేవంత్ రెడ్డిని పొగుడుతూ... జగన్మోహన్ రెడ్డి టీం సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది.