ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల రాజకీయం బాగానే చేస్తోందనే విధంగా సెటైర్లు వినిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఏపీలో అధికారంలో కూటమి ప్రభుత్వం ఉన్నప్పటికీ వారి మీద కేవలం నామమాత్రపు విమర్శలు చేస్తూ ఉంటుంది. కానీ గత ప్రభుత్వం వైసీపీ పాలన పైన మాత్రం చాలా ఘాటుగానే స్పందిస్తూ ఉంటుంది షర్మిల. ముఖ్యంగా భారీ వరదలు వచ్చి ప్రజలు అతలాకుతులమవుతూ ఉన్నది అందుకు కారణం వైసీపీనే అంటూ ఎప్పుడు విమర్శిస్తూనే ఉంటుంది.


కానీ వాస్తవానికి అన్ని పార్టీలు కూడా ఇక్కడ కారణమే ఎందుకంటే బుడమేరు పొంగి విజయవాడ ప్రాంతాలలో ఉండేటువంటి నివాసాలలోకి రావడం వల్ల ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయితే ఇలాంటి వరదలు వస్తాయని ఎవరూ కూడా ఊహించలేదు. షర్మిల మాత్రం టిడిపి కూటమిని వదిలేసి కేవలం జగన్ ప్రభుత్వాన్ని మాత్రమే టార్గెట్ చేస్తోంది.వైసీపీ నేతలు ఈ విషయాన్ని తప్పు పడుతూ ఉన్నారు. వైసిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నీటి ప్రాజెక్టులను మెయింటైన్ చేయలేదని నిధులు ఇవ్వలేదని షర్మిల విమర్శిస్తుంది. దీని ఫలితంగానే నదులలో గేట్లు ఉడిపోతున్నాయి అంటూ ఆమె తెలియజేసింది.


అన్నమయ్య ప్రాజెక్టు గేటు విరిగిపోవడం మరొకసారి ఈ ఉదాంతాన్ని తెలియజేస్తోంది. కేంద్రంలో మోడీ ప్రభుత్వం మీద ఫైర్ అవుతూ ఏపీలో వైసీపీ పార్టీ మీద ఫైర్ అవుతూ ఉన్నది. కానీ ఏపీలో మద్దతు ఇచ్చిన కూటమి అధికారంలో ఉన్నప్పటికీ ఏమి సహాయం చేయలేదంటూ డిమాండ్ చేస్తుంది. ఆంధ్రని అన్ని విధాలుగా ఆదుకోవాలని తెలియజేస్తోంది. వైసీపీ పార్టీని టార్గెట్ చేస్తూ ఉండడంతో ఆనేతలు ఈమె పైన కాస్త ఫైర్ అవుతూ ఉన్నారు. అన్ని పార్టీలకు శత్రువుగా వైసిపి మారిపోయిందని చెప్పవచ్చు. వైసీపీ నేతలు ప్రస్తుతం ఏపీలో టిడిపి, జనసేన, బిజెపి పార్టీలు కూటమిలో ఉన్నాయని తెలియదా కేవలం జగన్ మాత్రమే విమర్శిస్తుంటారా చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో ఉన్నది ఎవరిని విమర్శించాలో తెలియదా అంటు కామెంట్స్ చేస్తున్నారు. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న కేవలం తమ మీద విమర్శలేనా అంటూ వాపోతున్నారు నేతలు.

మరింత సమాచారం తెలుసుకోండి: