విజయవాడలో కనీవినీ ఎరుగని రీతిలో వరదలు పోటెత్తాయి. బుడమేరు కారణంగా ఈ సిటీ 50 శాతం జలదిగ్బంధంలో ఇరుక్కుపోయింది. బుడమేరు గేట్లు ఎత్తడం వల్లే సిటీకి ఈ నీటి విపత్తు తలెత్తిందని జగన్‌ మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. విజయవాడకు ఆనుకొని కృష్ణ నది ఉంటుంది. ఆ నదీపరివాహిక ప్రాంతాల్లోకి వరదలు పోటెత్తడం సహజం. దీన్ని ఊహించి ముందుగానే రిటైనింగ్ వాల్ కట్టారు. ఈ వాల్ నిర్మాణంలో బాబు, జగన్ ఇద్దరూ పాలుపంచుకున్నారు. అందువల్ల వాళ్లు సేఫ్. కానీ సింగ్ నగర్, అంబాపురం, వాంబే కాలని, రాజరాజేశ్వరిపేట, మిల్క్ ప్రాజెక్టు, స్వాతి రోడ్డు, భవానిపురం ప్రాంత నివాసులు మాత్రం సముద్రం లాంటి వరదల్లో ఇరుక్కుపోయారు. మ్యాప్ చూస్తే ఈ ప్రదేశం ఒక గాలిపటం లాగా కనిపిస్తుంది.

ఈ ప్రాంతాలు ఉన్న ప్రదేశం మొత్తం బుడమేరు కాలనీ ప్లాటింగ్ ఏరియా అని కొన్నేళ్ల క్రితమే గుర్తించారు. బుడమేరు మైలవరం, వెలగలేరు గ్రామం నుంచి ఏపీలో స్టార్ట్ అవుతుంది. వెలగలేరు గ్రామం వద్ద ఓ ఆనకట్ట ఉంటుంది. 1977లో కట్టిన ఆనకట్ట బుడమేరు పెద్దగా పొంగకుండా ఆపడానికి ఉపయోగపడింది. ఇది చాలా పరిమిత స్థాయిలో మాత్రమే నీటిని ఆపగలుగుతుంది. పరిమితి దాటితే దాని పైనుంచి నీళ్లు రాక తప్పదు. పైగా ఈ వాగులో పులి వాగు, భీమ వాగు, లోయ వాగు అంటే చిన్న చిన్న వాగులన్నీ కూడా కలుస్తాయి. ఏర్లు కూడా ఇందులో మిక్స్ అవుతాయి. ఇది చివరికి కొల్లేరులో కలుస్తుంది.  


ఆనకట్ట ఉన్నా పెద్ద వరదను ఏమాత్రం కట్టడి చేయలేకపోయింది కాబట్టి ఈసారి వరద ప్రమాదం మరింత తీవ్రంగా మారింది 2005లో ఒకసారి ఇలాంటి వరదలు వచ్చాయి కానీ అప్పుడు వరదల స్థాయి కొద్దిగా తక్కువగా ఉంది. అయితే ఆ సమయంలోనే వైయస్ రాజశేఖర్ రెడ్డి ఇబ్రహీంపట్నం దగ్గర ఒక ఛానల్ ద్వారా వాగును డైవర్ట్ చేద్దామని ప్రతిపాదించారు. ఆ ఛానల్ ద్వారా కృష్ణా నదిలోకి నీళ్లు వెళ్లే లాగా ప్లాన్ చేశారు. ప్లాన్ ప్రకారమే దాన్ని పూర్తి చేశారు. దీని పేరు బుడమేరు డైవర్షన్ ఛానల్. అయితే కృష్ణ నదిలో 12 అడుగుల కంటే తక్కువ నీటిమట్టం ఉంటేనే ఈ ఛానల్ ద్వారా వెళ్లే నీళ్లు అందులో కలుస్తాయి. లేదంటే తిరిగి మళ్లీ వెనక్కి వస్తాయి. అయితే ఈసారి కృష్ణ నది నీటిమట్టం 12 అడుగుల కంటే ఎక్కువ పెరిగిపోయింది. దానివల్ల ఆ ఛానల్ వల్ల ఉపయోగం లేకుండా పోయింది. బుడమేరును డైవర్ట్ చేసే చాలా పిల్ల కాలవలు కూడా ఏర్పాటు చేశారు అయితే వాటిని కొంతమంది ఆక్రమించేశారు. దీనివల్ల నీరు అనేది డైవర్ట్ కాలేకపోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: