ఇవాళ.. ఉదయం నాలుగు గంటల సమయంలో మాజీ ఎంపీ నందిగాం సురేష్ అరెస్టు అయినట్లు సమాచారం అందుతోంది. హైదరాబాద్ లో ఉన్న బాపట్ల మాజీ పార్లమెంట్ సభ్యులు నందిగామ సురేష్ను గుంటూరు పోలీసులు అరెస్టు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. హైదరాబాదులో అరెస్టు చేసిన వైసీపీ మాజీ ఎంపీ నందిగాం సురేష్ ను... గుంటూరు లేదా మంగళగిరి తరలించే అవకాశాలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ కార్యాలయం పై దాడి చేసిన కేసులో.. ప్రధాన నిందితులుగా నందిగాం సురేష్ ఉన్నారు. ఇక ఈ కేసులో బెయిల్ పిటిషన్ కూడా ఏపీ హైకోర్టు బుధవారం కొట్టు వేసిన సంగతి తెలిసిందే.
దీంతో మొదటగా వైసిపి మాజీ ఎంపీ నందిగాo సురేష్ అరెస్టు చేశారు ఏపీ పోలీసులు. మంగళగిరిలోని టిడిపి కేంద్ర కార్యాలయం పై... వైసిపి నేతలు దాడి చేశారు. ఈ సంఘటన జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు జరిగింది. దేవినేని అవినాష్, అప్పి రెడ్డి, నందిగాం సురేష్ మరియు తలసీల రఘు ఇలా మొత్తం 14 మంది ఈ కేసులో నిందితులై ఉన్న సంగతి తెలిసిందే.
ఈ నిందితులందరూ ఒకే టీడీపీ కేంద్ర కార్యాలయం పై దాడి చేయడమే కాకుండా... అక్కడ వీరంగం సృష్టించారని కేసు పెట్టింది టిడిపి పార్టీ. అయితే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఈ కేసులు ఎవరు పట్టించుకోలేదు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటగా ఈ కేసును డీల్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే అరెస్టుల పర్వం మొదలైంది.