గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఈసారి రెండు తెలుగు రాష్ట్రాలను ఒక్కసారిగా వరదలు ముంచెత్తాయి.. ముఖ్యంగా ప్రజలు నిద్రలేచి ఉదయం చూసే లోపు రాత్రికి రాత్రే నీళ్లన్నీ కూడా ఇళ్లల్లోకి వచ్చేసాయి.. సుమారుగా కొన్ని వందల ఇళ్లల్లో ఇల్లే జలమయం అయినట్టుగా తెలుస్తోంది.. అలాగే పెద్ద పెద్ద బిల్డింగులు సైతం వరదలా దాటికి కనిపించకుండానే మునిగిపోయాయట  పెద్ద పెద్ద అపార్ట్మెంట్లో సైతం సగానికి సగం నీటిలోని మునిగిపోయాయని పలువురు ప్రజలు తెలియజేస్తున్నారు. అంతటి వరదలలో కూడా ప్రజలు ప్రాణాలను కాపాడుకోవడం చాలా గగనంలా మారిపోయినది.


ముఖ్యంగా చాలా కుటుంబాలలోని ఇళ్లలోని సామాగ్రి మొత్తం కూడా అలాగే వదిలేసి చివరికి తమ ప్రాణాలు కాపాడుకోవడం కోసం బయటికి వచ్చేసారు. ఆహారం కోసం కూడా అల్లాడిపోతున్నారు. ఇప్పటికీ ఇంకా నీటి ప్రవాహం తగ్గకపోవడంతో చాలామంది ఇళ్లకు వెళ్లలేక సదూర తీరంలో తలదాచుకుంటున్నట్లు తెలుస్తోంది. సహాయం చేసే వారి కోసం ఎంతో ఆత్రుతగా ఏపీ ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఆహార  ప్యాకెట్లను ఎన్ని ఇచ్చినా కూడా ఈ ఆకలి కేకలు తగ్గడం లేదు ముఖ్యంగా ఫంక్షన్ హాలు స్కూల్లలో ఇలా ఎన్నోచోట్ల ఆశ్రమం పొందుతున్నారట.


ఇలా ఎవరు ఊహించని సంఘటన ఈ వరదల వల్ల రావడంతో ప్రజలు పెద్ద ఎత్తున కూడా నష్టపోయారట చాలామంది పేద కుటుంబాలు ఆర్థికంగా నిలదొప్పుకున్నప్పటికీ ఎన్నో కుటుంబాలు మళ్లీ జీరో స్థాయికి పడిపోయాయి. ముఖ్యంగా చాలామంది EMI ద్వారా ఇంటి సామాగ్రిని కొనుగోలు చేసిన వారు. ఇప్పుడు ఇలాంటి వస్తువులు అన్నీ కూడా బురదపాలు అయ్యాయని ప్రజలు వాపోతున్నారు.వరదలలో ఎటుపోలేని పరిస్థితి ఉండడం జరిగింది.. దీంతో ఒక్కో చిన్న కుటుంబం నుంచి మొదలుపెడితే సుమారుగా లక్ష రూపాయల నుంచి రూ .5 లక్షల వరకు ఒక్కో కుటుంబానికి నష్టం జరిగినట్లుగా నివేదికలు తెలియజేస్తున్నాయి. కొంతమంది విద్యార్థుల సర్టిఫికెట్లు వరదలలో కొట్టుకుపోయాయని ఉద్యోగులు కూడా ఎంతో కష్టపడి సంపాదించినవన్నీ కూడా వరదలలో కొట్టుకుపోయాయని మళ్లీ పాత జీవితాన్ని మొదలుపెట్టే పరిస్థితి ఏర్పడిందంటూ వాపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: