తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, టాలీవుడ్ టాప్ మోస్ట్ హీరో నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాంటి హీరో నందమూరి బాలకృష్ణ పై రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్రలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇండస్ట్రీలోకి నందమూరి బాలయ్య వచ్చి 50 సంవత్సరాలు ఇటీవల పూర్తయింది. ఈ తరుణంలోనే హైదరాబాదులో ఆదివారం రోజున... గ్రాండ్ గా ఒక ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రావాల్సి ఉంది.


అయితే ఆదివారం రోజున విజయవాడ మహా నగరానికి వరదలు వచ్చిన నేపథ్యంలో... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన హైదరాబాద్ పర్యటనను.. రద్దు చేసుకున్నారు. ఆయన ప్రజల కోసం పనిచేశారు. అయితే రేవంత్ రెడ్డి హైదరాబాదులో ఉన్నా కూడా.. బాలయ్య ఈవెంట్ కు రాలేదని సమాచారం. నందమూరి బాలయ్య 50 సంవత్సరాల పండుగకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లకపోవడం పై పెద్ద కారణమే ఉందని సమాచారం.


ముందుగా చెప్పినట్లు బాలయ్య స్వర్ణోత్సవం వేడుకకు... సీఎం రేవంత్ రెడ్డి వెళ్తారని అందరు అనుకున్నారు.  దీంతో తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వానికి సంబంధించిన సావి మీడియాను ఈవెంట్ వద్దకు పంపించారట.  రేవంత్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో... లైవ్ పెట్టాలని సావి మీడియా భావించిందట. అయితే దీన్ని బాలకృష్ణ ఈవెంట్ నిర్వహిస్తున్న శ్రేయాస్ మీడియా  అడ్డుకుందట.అంతేకాదు తెలంగాణ సీఎంవో ఉద్యోగుల పైన శ్రేయాస్ ఈవెంట్ ని నిర్వాహకులు దాడికి కూడా చేశారట.


అయితే ఈ విషయం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరకు వెళ్లింది. అయితే తమ ఉద్యోగులపై దాడి చేసినందుకు నిరసనగా... ఆ ఈవెంట్ కు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లలేదని సమాచారం. వరదల నేపథ్యంలో...  తాను కూడా బాలకృష్ణ ఈవెంట్ కు వెళ్లలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. తన అనుచరులతో చెప్పారట.అయితే అసలు విషయం బయటికి రాకుండా... సీఎం రేవంత్ రెడ్డి చూసుకున్నారట. ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: