రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన... మోడీ సర్కార్ సీరియస్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. వరదల విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం దారుణంగా విఫలమైందని... చాలా సీరియస్ అయిందట మోడీ ప్రభుత్వం. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా కేంద్ర హోంశాఖ లేఖ రాసినట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మొన్న శనివారం నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విపరీతంగా వర్షాలు పడుతున్నాయి.


ముఖ్యంగా మహబూబాబాద్ జిల్లాలో విపరీతంగా వర్షపాతం నమోదు అయింది. అలా ఖమ్మం పైన ఉన్న పట్టణాలలో వర్షం పడడంతో..  మున్నేరు వాగు చాలా ఉధృతంగా ప్రవహించింది. దింతో ఖమ్మం పట్టణం దాదాపుగా మునిగిపోయింది. చాలామంది వరదలో కొట్టుకుపోయారు. కొంతమంది మరణించారు. అయితే ఖమ్మం జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉన్నా కూడా ఎవ్వరూ కూడా సహాయం చేయలేదని ఖమ్మం ప్రజలు చెబుతున్నారు.

 

అయితే ఇలాంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన కేంద్రం సీరియస్ అయింది. కేంద్రం నుంచి రెండు హెలికాప్టర్ ఇప్పటికే పంపిస్తే... వాటిని ఏం చేశారని ప్రశ్నించింది. అంతేకాదు తెలంగాణలో వచ్చిన వరద విపత్తుపై ఎలాంటి సమాచారం ఇవ్వలేదని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చురకలాంటించింది కేంద్ర సర్కారు. అలాగే ఏడు ndrf  బృందాలను, పడవలను కూడా పంపించినట్లు కేంద్ర ప్రభుత్వ స్పష్టం చేసింది.


కానీ ఖమ్మంలో ఇంత జరుగుతున్నా కూడా... ఒక్క నివేదిక తెలంగాణ ప్రభుత్వం నుంచి రాలేదని మోడీ ప్రభుత్వం ఫైర్ అయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం...  వరదలపై  వెంట వెంటనే చర్యలు తీసుకుందని స్పష్టం చేశారు కేంద్ర పెద్దలు. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తుందని నిలదీశారు. రోజువారి నివేదికను కచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పంపాలని కేంద్ర ప్రభుత్వం... ప్రభుత్వ కార్యదర్శి కి లేఖ రాయడం జరిగింది. మరి దీనిపై రేవంత్ సర్కార్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: