-వరదలు వస్తే వణుకుతున్న ప్రజలు.
నెల్లూరు జిల్లా పేరు చెప్పగానే చాలామందికి పెన్నా నది గుర్తిస్తుంది. ఇక వర్షాకాలం వచ్చిందంటే చాలు నెల్లూరు జిల్లా ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతకాల్సిందే. పెన్నా నది ఉగ్రరూపం దాలిస్తే ప్రజల బతుకులు బుగ్గిపాలవుతాయి. ఎప్పుడొచ్చి వరద మీద పడిపోతుందో తెలియని పరిస్థితుల్లో వారు బతుకుతూ ఉంటారు. అలాంటి పెన్నా నది గురించి కొన్ని వివరాలు చూద్దాం
పెన్నా పరేషాన్ :
పెన్నా నది ఎప్పుడైతే ఉగ్రరూపం దాలుస్తుందో అప్పుడు నది తీర ప్రాంతాల్లోని ప్రజలంతా బిక్కుబిక్కుమంటూ బతుకుతారు. భగత్ సింగ్ కాలనీ ప్రజలు భయపడుతూ ఉంటారు. అంతేకాదు నది సమీపంలో కట్టుకున్న ఇండ్లన్నీ ఎప్పుడు కూలిపోతాయో అర్థం కాని పరిస్థితిలో ఉంటారు. నెల్లూరులోని భగత్ సింగ్ కాలనీ, జనార్దన్ రెడ్డి కాలనీ, ఒర్లుకట్ట ప్రాంతాలు ఎప్పటికప్పుడు కోతకు గురవుతూ వాటర్ ఇండ్లలోకి చేరుతుంది. ఎప్పుడు వర్షాకాలం వచ్చినా ఈ ప్రాంతమంతా జలదిగ్బంధంలో కూరుకు పోతుంది. అధికారులు వచ్చి చూసి వెళ్లడం తప్ప ప్రత్యామ్నాయ మార్గాలు వెతికిన పరిస్థితి అయితే కనిపించడం లేదు. అయితే గత ప్రభుత్వ హయాంలో నెల్లూరు పెన్నా నదిపై ప్రహరీ గోడ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.