వైసిపి నేతలను నిద్రపోకుండా చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. వైసిపి నేతలు ఎక్కడ దాక్కున్నా కూడా.. ఏపీ పోలీసులు అరెస్టు చేస్తున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, చంద్రబాబు ఇంటి పైన దాడి చేసిన వైసిపి నేతలను వరుసగా అరెస్టు చేస్తోంది తెలుగుదేశం ప్రభుత్వం. ఇవాళ ఉదయం ఇప్పటికే బాపట్ల మాజీ వైసీపీ ఎంపీ నందిగం సురేష్ ను హైదరాబాద్ వెళుతుండగా అరెస్టు చేశారు ఏపీ పోలీసులు.


అయితే ప్రస్తుతం ఇదే కేసులో ఇరుక్కున్న మాజీ మంత్రి జోగి రమేష్  కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్నటి నుంచి కనిపించడం లేదట. ఆయన కూడా ఏపీని వదిలి విదేశాలకు వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకున్నారట. ఇందులో భాగంగానే నిన్న రాత్రి హైదరాబాద్కు చేరుకున్నారట మాజీ మంత్రి జోగి రమేష్. ప్రస్తుతం ఆయన హైదరాబాదులోని ఓ ప్రముఖ రాజకీయ నాయకుడు ఇంట్లో ఉన్నట్లు సమాచారం. అయితే ఈ సమాచారం అందుకున్న ఏపీ పోలీసులు.. అలర్ట్ అయ్యారట.

మాజీ మంత్రి జోగి రమేష్ అలాగే ఆయన అనుచరులను అరెస్టు చేసేందుకు హైదరాబాదుకు... ఏపీ పోలీసులు వస్తున్నారట. అయితే ఆలోపే హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి.. దుబాయ్ వెళ్లాలని జోగి రమేష్ స్కెచ్ వేసినట్లు సమాచారం.  మరి జోగి రమేష్ ను ఇవాళ హైదరాబాదులో అరెస్టు చేస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇది ఇలా ఉండగా చంద్రబాబు ఇంటిపై అలాగే తెలుగుదేశం కార్యాలయం పై దాడి చేసిన కేసులో జోగి రమేష్ ఇరుక్కున్నారు.


అయితే ఈ కేసుల్లో వైసిపి నేతలకు బుధవారం రోజున  ఏపీ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ముందస్తు బెయిల్ కు అప్లై చేసుకున్న వైసిపి నేతలకు ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చి... బెయిల్  పై వెనక్కి తగ్గింది. దీంతో మొదటగా బాపట్ల మాజీ పార్లమెంటు సభ్యులు నందిగాం సురేష్ ను అరెస్టు చేశారు ఏపీ పోలీసులు.  ప్రస్తుతం జోగి రమేష్ కోసం వెతుకుతున్నారు. ఆ తర్వాత దేవినేని అవినాష్  అరెస్ట్ అయ్యే ఛాన్సులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: