ఆంధ్రప్రదేశ్లో గత కొన్ని నెలల నుంచి వాలంటీర్ల పేర్లు వినిపించడం లేదు. దీంతో అందరూ కూడా ఇక వాలంటరీలను తీసేశారనే విధంగా సైలెంట్ అయిపోయారు. ఎన్నికల ముందు వరకు వాలంటరీ వ్యవస్థ రాజకీయాలలో కీలకంగా మారింది.. దీంతో వాలంటరీలను కూడా ఎన్నికల సమయంలో విధులకు దూరంగా పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే కూటమి సర్కారు మాత్రం ఏపీలో అధికారం వస్తే పదివేల రూపాయలు అందిస్తామంటూ హామీ ఇచ్చారు. ఎవరిని తీసేయమంటూ ప్రకటించారు.


ప్రతినెల పింఛన్ పంపిణీ తో పాటు ఇతరత్రా వాటినీ వాలంటరీలే చూసుకునేవారు. ముఖ్యంగా వార్డ్, గ్రామ సచివాలయ వాలంటరీల సిబ్బందితోనే చాలా పనులు అయ్యేవి కానీ ఇప్పుడు వాలంటరీ సేవలకు మళ్లీ చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇందుకు కారణం వరదలు విపత్తులే అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ప్రజల వివరాలు తెలుసుకునేందుకు సరైన యంత్రాంగం లేకపోవడం వల్లే.. ఇలాంటి ఇబ్బందులని అంతేకాకుండా స్థానికంగా ప్రజల వివరాలు కూడా తెలిసినవారు ఎవరైనా ఉంటేనే బాగుంటుందనుకుంటున్న సమయంలో వాలంటరీలు గుర్తుకు రావడంతో వాలంటరీలను నియమించినట్లు ఏపీ ప్రభుత్వం తెలుస్తోంది.


ముఖ్యంగా కృష్ణ, గుంటూరు ,ఏలూరు జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలలో నిన్నటి రోజు నుంచి వాలంటరీ సేవలను అందుబాటులోకి తీసుకున్నట్లు సమాచారం. ఇందులో సగం మందికి పైగా వాలంటరీ సేవలు వినియోగించుకున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలుస్తోంది.. అలాగే మరి కొన్నిచోట్ల కూడ త్వరలోనే తీసుకోబోతున్నట్లు సమాచారం. అయితే ఇప్పుడే ఒక కొత్త విధానం తెరమీదకి రావడం జరిగింది. ఎన్నికల ముందు రాజీనామాలు చేయని వాలంటరీలను మాత్రమే ఇప్పుడు విధుల్లోకి తీసుకుంటున్నారని ఎన్నికలకు ముందు వైసీపీ నాయకులకు భయపడి రాజీనామా చేసిన వారిని మాత్రం పూర్తిగా పక్కన పెడుతున్నట్లు వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దీంతో అటు వాలంటరీలో ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం విధుల్లో తీసుకుంటున్న వాలంటరీలు వేరే అన్నట్లుగా ఎక్కడ ప్రభుత్వం అధికారికంగా అయితే ప్రకటించలేదు. మరి ఈ విషయం పైన ఏపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: