అధికారం ఉండటంతో తాము ఆడింది ఆట.. పాడింది పాటగా వ్యవహరించారు. అయితే ఈ ఏడాది జరిగిన ఎన్నికలలో ప్రజలు లాగిపెట్టి కొట్టారు. వైసీపీని కేవలం 11 సీట్లకు పరిమితం చేశారు. దీంతో వైసిపి నేతలకు ఒక్కసారికి షాక్ తగిలింది. వైసిపి అధికారంలో ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు వ్యవహరించి.. పదవులు మాకు కావాలంటే మాకు కావాలని పోటీపడిన నేతలు అందరూ.. ఇప్పుడు పదవి ఇస్తాం తీసుకోమన్నా తీసుకొని పరిస్థితి. ఈ క్రమంలోనే పలు పదవులు కాళీ అయిపోతున్నాయి. అసలు వైసీపీలో జిల్లా పార్టీ పగ్గలు చేపట్టేందుకు కూడా ఎవరు ముందుకు రావడం లేదు.
ఈ క్రమంలోనే అనంతపురం జిల్లాలోని.. సత్యసాయి జిల్లా వైసీపీ పగ్గాలు చేపట్టేందుకు ఆ పార్టీ కీలక నేతలు ఎవరు ముందుకు రాలేదు. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి జగన్‌ను పిలిచి మరి జిల్లా పార్టీ పగ్గాలు తీసుకోవాలని చెప్పినా.. ఏమాత్రం ఇష్టపడలేదని తెలుస్తోంది. దీంతో మొన్న ఎన్నికలలో పెనుగొండ నుంచి పోటీ చేసి ఓడిపోయిన మాజీ మంత్రి ఉషాశ్రీ చరణ్‌కు జగన్ బలవంతంగా జిల్లా పార్టీ పగ్గాలు అప్పగించారు.
ఆమె మామూలుగా ఎమ్మెల్యే స్థాయికి ఎక్కువ. అలాంటిది ఏకంగా పార్టీలో ఎవరు గతిలేక పోవడంతో జగన్ సత్యసాయి జిల్లా వైసీపీ పగ్గాలు అప్పగించేశారు. ఇక మొన్న ఎన్నికలలో పెనుగొండ నుంచి ప్రస్తుత మంత్రి సబితమ్మ చేతిలో ఓడిపోయిన ఉషా.. అంతకముందు కళ్యాణదుర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సంగతి తెలిసిందే.