ఉత్తర కొరియాలో ఇటీవల భారీ వరదలు వచ్చాయి. ఆ వరదలు అలాంటి ఇలాంటి వరదలు కాదు. అసాధారణ రీతిలో వచ్చాయి. మామూలుగా మన బెజవాడలో వరదలు వస్తే ఎన్ని ఇబ్బందులు పడుతున్నామో.. బెజవాడలో జల ప్రళయం ఏ రేంజ్ లో ఉందో.. ప్రజలను కాపాడుకునేందుకు వారిని ఆదుకునేందుకు ప్రతి ఒక్కరు మానవ దృక్పథంతో ఎలా స్పందిస్తున్నారో ?.. చూస్తూనే ఉన్నాం. అయితే బెజవాడలో వచ్చిన వరదలు కంటే 30 రెట్లు ఎక్కువ స్థాయి వరదలు ఉత్తర కొరియాకు వచ్చి పలు పట్టణాలను గ్రామాలను ముంచి వేశాయి. ఆ వరదల్లో చాలామంది చనిపోయారు. ఉత్తరకొరియా అధినేత కిమ్ కూడా చాలా బాధపడ్డారు. ఆ ప్రాంతాల్లో స్వయంగా పర్యటించారు. వారి సాధక బాధలు చూసి మనోవేదనకు గురయ్యారు.
విమర్శించే అంత ధైర్యం లేకపోయినా.. కిమ్ కూడా ఇటీవల ప్రజలకు కష్టాలు వస్తే స్పందించాలని అనుకుంటున్నారు. అందుకే వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించారు. చివరికి ఆయన ఇందులో కూడా ఎవరో ఒకరిని బలి చేయాల్సిందే అని డిసైడ్ అయ్యారు. వరదల్ని ఆపలేకపోయారని నింద వేస్తూ.. ఏకంగా 30 మందికి పైగా అధికారులను కారణంగా తేల్చారు. మామూలుగా అయితే వారిని ఉద్యోగాల నుంచి తీసేయటమో.. లేదా వారి ఇంక్రిమెంట్లు ఆపటం పనిష్మెంట్గా చేస్తూ ఉంటారు. అయితే కిమ్ వరదల నుంచి ప్రజలను కాపాడలేకపోయారని నిందను ప్రజలకు చెప్పి.. వారిని ఉరితీయుంచి వేశారు. ప్రజలకు చెప్పకపోయినా నష్టం ఏమీ లేదు. ఎందుకంటే అక్కడ కిమ్‌కి వ్యతిరేకంగా ఎవరు నోరు ఎత్తిన అదే గతి పడుతుంది.