2014లో ఆంధ్రప్రదేశ్లో ఓడిపోయిన.. పోరాటం చేసి 2019లో భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యారు వైయస్ జగన్ రెడ్డి. 2024 ఎన్నికలలో ఓడిపోయినా.. తిరిగి 2029 ఎన్నికలలో కచ్చితంగా గెలుస్తానన్న ధీమ జగన్‌లో ఉంది. వైసీపీకి కేవలం 11 అసెంబ్లీ సీట్లు మాత్రమే వచ్చాయి. అంటే పార్టీని ప్రతిపక్షంలో కూడా కూర్చోబెట్టలేదు. వైసీపీకి 11 సీట్లు వచ్చిన.. ఏకంగా ఓట్ల శాతం చూస్తే 40 వరకు ఉంది. అది వైసీపీ తాము కచ్చితంగా మళ్ళీ గెలుస్తామన్న ఈ ధీమాకు కారణం. ఇంకా చెప్పాలంటే 2019 ఎన్నికలలో 23 సీట్లు వచ్చిన టీడీపీకి 39% ఓట్లు మాత్రమే వచ్చాయి.


అదే వైసీపీకి 11 సీట్లు వచ్చిన.. ఏకంగా 40% ఓట్లు వచ్చాయి. ఏపీలో తామే ఏకైక ఆల్టర్నేటివ్ కాబట్టి.. ప్రతిపక్ష పాత్ర తమకి ఇవ్వాలని వైసీపీ అంటోంది. కచ్చితంగా కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తే ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు తిరిగి మరోసారి తమకే అధికారం కట్టబెడతారని.. జగన్ ధీమాగా ఉన్నారు. ఎంత లేదన్న బిజెపి ఎన్ని హైడ్రామాలు నడిపించిన.. తెలంగాణలో ఆ పార్టీ అధికారంలోకి రాలేదు సరి కదా.. కేవలం ఎనిమిది సీట్లతో సరిపెట్టుకుంది. కాంగ్రెస్ అక్కడ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోను కేవలం రెండు శాతం ఓటు బ్యాంకు ఉన్నా.. కాంగ్రెస్ పుంజుకుని 2029 ఎన్నికల నాటికి అధికారంలోకి వస్తుందని ఆశించడం కల అవుతుంది.


ఇక ఆంధ్రప్రదేశ్లో బిజెపి విడిగా పోటీ చేసిన ఆ పార్టీకి అంత సీన్ లేదు. జనసేన ప్రభావం కొన్ని ప్రాంతాలలో, కొన్ని జిల్లాలలో బలంగా ఉన్నా.. రాష్ట్రం అంతా ఆ పార్టీ ప్రభావం ఉండదని జగన్ లెక్కలు వేసుకుంటున్నారు. అందుకే కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంటే అది ఐదేళ్లలో కచ్చితంగా లభిస్తుందని.. 2029లో తాము కాస్త కష్టపడితే తిరిగి అధికారంలోకి వస్తామని జగన్ ధీమాతో ఉన్నట్టు తెలుస్తోంది. ఈరోజు కూటమి మీద ఆంధ్రప్రదేశ్ జనాలకు మోజు ఉండవచ్చు.. ఐదేళ్లు గడిచే కొద్దీ అది అలాగే ఉంటుందన్న గ్యారెంటే లేదు. అప్పుడు కచ్చితంగా ప్రభుత్వం వ్యతిరేకత తమ 40 శాతం ఓటు షేర్‌తో కలుపుకుని ముందుకు సాగేందుకు ఫ్యాన్ పార్టీకి మాత్రమే గోల్డెన్ ఛాన్స్ ఉందని జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: