ఈరోజు కూడా పవన్ కళ్యాణ్ అస్వస్థతతో బాధ పడుతూనే విజయవాడ వరదలపై సమీక్షలు నిర్వహించడం జరిగింది. జ్వరం అంతకంతకూ ఎక్కువ అవుతూ ఉండటంతో వైద్యులు పవన్ కళ్యాణ్ కు రెస్ట్ తీసుకోవాలని సూచనలు చేశారని సమాచారం. జ్వరంతో బాధ పడుతూనే పవన్ కళ్యాణ్ పారిశుద్ధ్య నిర్వహణపై అధికారులతో సమీక్ష చేసినట్టు తెలుస్తోంది. సూపర్ క్లోరినేషన్ చేపట్టాలని పవన్ అధికారులను ఆదేశించారు.
తన నివాసం నుంచి పవన్ కళ్యాణ్ రివ్యూలు నిర్వహించడం కొసమెరుపు. ఏలేరు రిజర్వాయర్ కు వరద ముప్పుకు సంబంధించిన వివరాలను సైతం పవన్ తెలుసుకుని తన వంతు సలహాలు, సూచనలు అందజేశారు. డిప్యూటీ సీఎం ఫ్యామిలీ మెంబర్స్ సైతం జ్వరాలతో బాధ పడుతున్నారని సమాచారం అందుతోంది. మారిన వాతావరణం వల్లే పవన్ వైరల్ ఫీవర్ బారిన పడ్డారని భోగట్టా.
మరోవైపు వరద ప్రభావిత ప్రాంతాల్లో నిత్యావసర సరుకుల పంపిణీ జరిగే విధంగా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలుస్తోంది. దాదాపుగా 2 లక్షల మంది లబ్ధిదారులకు లబ్ధి చేకూరేలా ప్రభుత్వం సరుకుల పంపిణీ చేపట్టనుందని తెలుస్తోంది. మరోవైపు పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్ నుంచి వేగంగా కోలుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. పవన్ క్రేజ్ మాత్రం అంతకంతకూ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. పవన్ కెరీర్ పరంగా భారీ బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకోవాలని అభిమానులు ఫీలవుతున్నారు.