* ఆపదలో ప్రజలను ఆదుకునే హీరో

* వద్దిరాజు రవిచంద్ర కీలక సమయంలో ఖమ్మం వాసులకు హెల్ప్  

* ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటామంటున్న ప్రజలు  

( తెలంగాణ - ఇండియా హెరాల్డ్)

ఆపదలో ఉన్న వారిని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర ఎల్లప్పుడూ ఆదుకుంటారు. మరోసారి ఈ విషయాన్ని ప్రూవ్ చేసుకున్నారు. ఖమ్మం ప్రజలను ఆదుకోవడంలో ఆయన గొప్ప దాతృత్వాన్ని చాటుకున్నారు. గత వందేళ్ళలో ఎన్నడూ లేనివిధంగా మున్నేరు వాగులో వార్త నీరు చేరి చుట్టుపక్కల ప్రాంతాలను ముంచేసింది. ఆదివారం ఉదయం రెండు మూడు గంటల సమయంలోనే కాల్వొడ్డు, బొక్కలగడ్డ, గణేష్ నగర్, వెంకటేశ్వర నగర్, సారథి నగర్, రాజీవ్ గృహకల్ప, వికలాంగుల కాలనీ ఇండ్లలోకి వరద పోటెత్తింది. ఎలక్ట్రానిక్ వస్తువులతో పాటు ఆహార వస్తువులన్నీ కూడా వరదలో పడిపోయి పాడయ్యాయి.

దీని వల్ల ప్రజలు ఆకలితో అలమటిస్తూ సాయం చేసే వారి కోసం చాలుగా చూడటం మొదలుపెట్టారు. సరిగ్గా అలాంటి సమయంల. ఎంపీ రవిచంద్ర ఢిల్లీ నుంచి హూటాహుటిన ఖమ్మం చేరుకున్నారు. సోమ, మంగళవారాల్లో మున్నేరు లోతట్టు ప్రాంతాలలో తిరుగుతూ వరద బాధితులకు మేం ఆదుకుంటామనే భరోసా ఇచ్చారు. వరద బాధితుల దయనీయ పరిస్థితిని కళ్లారా చూసిన ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. పుట్టెడు దుఃఖంలో ఉన్న వారిని ఆదుకునేందుకు కూడా ఒక గొప్ప త్యాగం చేశారు. ఈ బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఆదేశాల మేరకు తన ఒక నెల జీతాన్ని వరద బాధితులకు విరాళంగా అందించారు.

ఆదివారం వరదలు రాగా సోమవారం సాయంత్రమే ఆయన బాధితులకు బీఆర్ఎస్ కార్యకర్తల ద్వారా నిత్యావసరాలను ఆఫర్ చేశారు. అలానే మంగళవారం ఉదయం భారీ ఎత్తున నిత్యావసరాలను ఖమ్మం, పాలేరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని వరద బాధితులకు అందజేశారు.

మంగళవారం ఉదయం రవీందర్ రావు నివాసానికి ఎమ్మెల్సీ రవీందర్ రావు, మాజీ జెడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు, బీఆర్‌ఎస్ నాయకులు శీలంశెట్టి వీరభద్రం, బెల్లం వేణు, తోట వీరభద్రం, గుండ్లపల్లి శేషగిరిరావు తదితర ప్రముఖులు, మద్దతుదారులు తరలివచ్చారు. ఖమ్మంలోని బురహన్‌పురంలో జెండాను రెపరెపలాడించారు. కాల్వొడ్డు, బొక్కలగడ్డ, గణేష్‌నగర్‌, వెంకటేశ్వరనగర్‌, సారథినగర్‌, రాజీవ్‌ గృహకల్ప, వికలాంగుల కాలనీతోపాటు పలు ప్రాంతాలకు నిత్యావసర సరకుల వాహనాలను తరలించారు. వాహనాలు వచ్చిన వెంటనే సరుకుల పంపిణీ ప్రారంభించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: