* హెటిరో సంస్థాదినేత గులాబీ పార్టీకి చెందిన వ్యక్తి
* కోటి రూపాయల విరాళం తో పాటు మందులు, వైద్యం ఉచితం
తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను భారీ వర్షాలు కుదిపేసాయి. శనివారం ప్రారంభమైన భారీ వర్షాలు... ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్రాలను అస్సలు వీడటం లేదు. మరో నాలుగు ఐదు రోజులపాటు రెండు తెలుగు రాష్ట్రాలలో వర్షాలు పడనున్నట్లు.. వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా.. మొన్నటి నుంచి వర్షాలు పడుతున్నాయి.
దీంతో ఖమ్మం పట్టణంలో తీవ్ర నష్టం జరిగింది. అయితే ఇలాంటి నేపథ్యంలోనే ఖమ్మం జిల్లా వరద బాధితులను కాపాడుకునేందుకు... గులాబీ పార్టీ కీలక ప్రకటన చేసింది. తమ ప్రజాప్రతినిధుల నెల జీతం ఖమ్మం వరద బాధితులకు ఇస్తున్నట్లు కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. ఇందులో భాగంగానే ఖమ్మం వరద బాధితులకు.. గులాబీ పార్టీ రాజ్యసభ సభ్యులు, హెటీరో అడ్రస్ అధినేత బండి పార్థసారధి రెడ్డి కూడా సహాయం చేశారు. కెసిఆర్ చెప్పిన దానికంటే ఎక్కువగానే.. బండి పార్థసారథి రెడ్డి చేయడం జరిగింది. తన వంతు గా ఖమ్మం వరద బాధితుల కోసం కోటి రూపాయలు విరాళం ఇచ్చారు ఈ గులాబీ పార్టీ ఎంపీ.
ఈ కోటి రూపాయల చెక్కును ఖమ్మం కలెక్టర్కు అందజేశారు. అంతేకాదు కోటి రూపాయలతో పాటు.... ఖమ్మం వరద బాధితులకు ఉచితంగా మందులను పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. డబ్బుల గురించి ఆలోచించకుండా... అందరికీ ఉచితంగా మెడిసిన్ అందిస్తామని తెలిపారు. అంతేకాకుండా... ఖమ్మం జిల్లాలో వారం రోజుల పాటు ఉచితంగా వైద్య సేవలు కూడా అందించేందుకు... ఎంపీ బండి పార్థసారధి రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.