గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనేక ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇక ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అనేక లోతట్టు ప్రాంతాలు ఇప్పటికే నీటిలో మునిగిపోయాయి. కొన్ని చెరువుల గట్లు ఒక్కసారిగా తెగిపోవడం వల్ల కూడా కొన్ని ప్రాంతాలు అనూహ్యంగా వరదల్లో చిక్కుకుపోయాయి. వరదల్లో అనేక ప్రాంతాలు చిక్కుకుపోవడంతో కొంత మంది వ్యక్తులు ఎంతో కష్టపడి వారికి చేయూతను కల్పిస్తున్నారు. అలాగే మరి కొంతమంది వరదల్లో చిక్కుకుపోయిన వారిని బయటకు తీస్తున్నారు. కొంత మంది హీరోలు కోట్లలో వరద బాధితులకు సహాయాన్ని కూడా చేస్తున్నారు . అలాగే మామూలు ప్రజలు కూడా వారికి తోచిన సహాయాన్ని వారు చేస్తూ వస్తున్నారు.

ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కీలక రాజకీయ నేతలలో ఒకరు అయినటువంటి నిమ్మల రామానాయుడు కూడా వరదల్లో చుక్కకున్న ప్రజల కోసం అద్భుతమైన స్థాయిలో పని చేస్తున్నాడు. ప్రస్తుతం నిమ్మల రామానాయుడు జలవనరుల శాఖ మంత్రిగా పని చేస్తున్నాడు. ఈయన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో వరదలు రావడం వల్ల అనేక ప్రాంతాల్లో నీటిలో మునగడంతో , అలా మునిగిన వారి కోసం అనేక చేయుత కార్యక్రమాలను చేస్తూ వర్షాన్ని , వరదలు ఏ మాత్రం లెక్కచేయకుండా రాత్రింబగళ్లు వరద బాధితులను కాపాడటమే లక్ష్యంగా పెట్టుకొని పని చేస్తున్నాడు. 

ఒక మంత్రి అయ్యి ఉండి కూడా ఆ స్థాయిలో వరద బాధితులను పట్టించుకుంటూ ఉండటంతో ఈయన గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలంతా గొప్పగా మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రాంతాలన్నీ వరద ముంపు నుండి బయటపడ్డాకే తాను విశ్రాంతి తీసుకుంటాను అని నిమ్మల తెలియజేస్తున్నాడు. తాజాగా వచ్చిన వరదలలో చిక్కిపోయిన వారి విషయంలో అత్యంత శ్రద్ధ వహిస్తున్న నిమ్మల రామానాయుడు వారిని కాపాడుతూ గొప్ప పేరును సంపాదించుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: