- మున్నేరుతో ఖమ్మం ప్రజలకు కన్నీరు..
- ముగ్గురు మంత్రులు ఉన్నా సాయం సున్నా..
- పేద ప్రజలను ఆదుకున్న పువ్వాడ అజయ్..

 గతంలో ఎన్నడు లేని విధంగా ఖమ్మంలో ఈసారి మున్నేరు  డ్యాం ఉధృతి పెరిగింది. ఒక్కసారిగా వరదలు రావడంతో  ఖమ్మం ముంపు ప్రాంతాలకు విపరీతమైన వరదలు వచ్చి  వేలాది మంది ప్రజలు వరదల్లో చిక్కుకున్నారు.  మొత్తం ఇండ్లే మునిగిపోవడంతో కనీసం తినడానికి తిండి లేక అనేక తిప్పలు పడ్డారు. వరద ఉధృతికి ఇండ్లు మొత్తం బురదతో నిండిపోయాయి. నీటి దాటికి ఇండ్లలో ఆస్తి నష్టాలు జరిగాయి. చివరికి ప్రజలు ప్రాణాలు కాపాడుకుంటే చాలు అనే విధంగా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ గడిపారు.  ఇంతటి విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం ఎంతో ఆదుకుంటుందని అనుకున్నారు. కానీ దానికి రివర్స్ అయిపోయింది. కనీసం ప్రభుత్వం నుంచి సహాయక చర్యలు అందలేదు. ఖమ్మంలో ముగ్గురు పెద్ద మంత్రులు ఉన్నా  సహాయక చర్యలు మాత్రం సున్నా అని ప్రజలు ఆరోపిస్తూ వస్తున్నారు. ఇదే సమయంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ ఖమ్మం ప్రజలకు ఆసరాగా నిలిచారు. ఆయనొక్కడే వరద బాధితులకు అండగా ఉంటూ సహాయక చర్యలు చేపట్టాడు.

 పువ్వాడ సహకారం:
 గత కొద్ది రోజులుగా కురిసిన వర్షాలకు ఉమ్మడి ఖమ్మం జిల్లా మొత్తం వాగులు వంకలు పొంగిపొర్లాయి. కొత్తగూడెం, మహబూబాబాద్,సూర్యపేట జిల్లాలో కూడా విపరీతమైనటువంటి వరద నష్టం జరిగింది. ఖమ్మంలో ఈ నష్టం మరింత ఎక్కువగా ఉంది. మున్నేరు డ్యాం ఉధృతి వల్ల  ఇంతటి తీవ్రమైన నష్టం జరిగింది.  ఇన్ని వర్షాలు పడుతున్నా వాతావరణ శాఖ అన్నిసార్లు హెచ్చరికలు చేస్తున్నా కానీ ప్రభుత్వం ప్రజలను అలర్ట్ చేయకపోవడం వల్ల ఖమ్మం ప్రజలు మరింత నష్టపోయారు.  దీనికి తోడు నష్టపోయిన వరద బాధితులను ప్రభుత్వం ఆదుకోవడంలో చాలా వెనుకబడిపోయిందని  అంటున్నారు. ఖమ్మంలో ఉండే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,తుమ్మల నాగేశ్వరరావు,భట్టి విక్రమార్క లను ఖమ్మం వరద బాధితుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎక్కడికక్కడ నిలదీశారు.


మొత్తం ఖమ్మం నుంచి 9 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే కనీసం 9 మంది వరద బాధితులను కాపాడలేకపోయారని విమర్శిస్తున్నారు. ఇదే తరుణంలో బీఆర్ఎస్ మాజీ మంత్రి పువ్వాడ అజయ్  ఖమ్మం మొత్తం తిరుగుతూ వరద బాధితులను పరామర్శిస్తూ వస్తున్నారు. అంతేకాదు తన సొంత ఖర్చులతో  వరద బాధితులందరికీ డివిజన్ల వారీగా తిరుగుతూ నిత్యవసర సరుకులు అందిస్తూ బాసటగా నిలుస్తున్నారు. ఆయన పర్యటనలో ఉన్నప్పుడు ఎంతో మంది ప్రజలు వచ్చి బాధ చెప్పుకుంటూ కన్నీరు పెట్టుకున్నారు. ఈ విధంగా పువ్వాడ అజయ్ ప్రజలకు భరోసా ఇచ్చారు తప్ప మంత్రులు ఎవరు కూడా ఆ విధమైన సహకారం చేయడానికి ముందుకు రాలేదని అంటున్నారు. ఇది ఏమైనా పువ్వాడ అజయ్  వరద బాధితులకు బాసటగా నిలవడంతో ఖమ్మం వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అధికారంలో లేకపోయినా పువ్వాడ అజయ్ చేసిన సేవలకు ఖమ్మంలో రియల్ హీరో అనిపించుకున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: