ఛానల్ కి సామాజిక బాధ్యత అనేది చాలా ముఖ్యము. ముఖ్యంగా రాజకీయ పార్టీలకు కొన్ని చానల్స్ కొమ్ము కాస్తూ ఉంటాయి. కొన్ని చానల్స్ మాత్రం నిష్పక్షపాతంగా ఉంటాయి ఇలాంటి ఛానల్స్ చాలా ముఖ్యము. ఒకప్పుడు అలాంటి వ్యవస్థలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు అలాంటివి పూర్తిగా తగ్గిపోయాయి. ఎవరో ఒకరు కామెంట్ పెడుతూ ఉంటారు.. మీరు ఒక వైపే అని.. అయితే అందుకు కౌంటర్లుగా కూడా కొన్ని చానల్స్ జర్నలిస్టులు కూడా మీరు ఆలోచించే తీరులోనే ఇది ఉంటుంది అన్నట్లుగా తెలియజేసిన సందర్భాలు ఉన్నాయి.



జగన్ ది తప్పయితే జగన్ది చెబుతూ ఉంటారు చంద్రబాబు తప్పయితే చంద్రబాబు చెబుతూ ఉంటారు.. మంచిదైతే మంచి అని చెప్పేవారు చాలామంది ఉన్నప్పటికీ వారిని పైకి ఎదగనివ్వకుండా చేస్తూ ఉంటారు. అయితే ఇందులో ఏ వైపుగా చూసే వారికి ఆ వైపుగానే కనిపిస్తూ ఉంటుంది.మంచి ఏది అనేది వారు ఆలోచించి దాన్నిబట్టి ఉంటుంది. ఇప్పుడు తాజాగా ఒక ప్రముఖ ఛానల్ చేసిన సాహసానికి చాలామంది మెచ్చుకుంటున్నారు.


కొన్ని చానల్స్ నచ్చని వాళ్ల ఏదో ఒకటి ముద్ర వేసే ప్రయత్నం చేస్తూనే ఉంటారు.. బిగ్ టీవీ అనేది ఒక ముద్రతో కాకుండా ఒక బాధ్యత మైనటువంటి పనిచేసింది. టిడిపి పార్టీ నేత ఆదిమూలం సత్యవీడు ఎమ్మెల్యే అతడి మీద లైంగిక వేధింపులు చేస్తున్నాడంటూ ఒక అమ్మాయి , మోసం చేశాడు వాడుకుంటున్నాడు, వేధిస్తున్నాడంటూ ఈ విషయాన్ని ఆ అమ్మాయి ప్రెస్ క్యాంపు తో కలిసి వీడియో తీసి మరి.. తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి పంపిస్తే.. అసలు పట్టించుకోలేదట. స్వయంగా ఈ విషయం ఆ ఎమ్మెల్యేకి వెళ్లిపోయిందట. వెంటనే ఈ అమ్మాయిని బెదిరింపులకు కూడా గురి చేశారట. మీడియా ముందుకు వచ్చి తన రక్షణకి తన భర్త రక్షణ కోసం బిగ్ టీవీ వద్దకు వెళ్లగా  హైలెట్గా మిగిలింది. కానీ ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇతర చానల్స్ వద్దకు వెళ్లలేదు.. బిగ్ టివి కాస్త ఇప్పుడు సిన్సియర్గా అనిపించింది అంటూ చాలామంది మాట్లాడుకుంటున్నారు. అక్కడ అమ్మాయి చెప్పగానే హైలెట్ చేస్తూ ఉన్నారు. ఆ వెంటనే టిడిపి పార్టీ స్పందించి చర్యలు తీసుకొని ఆ ఎమ్మెల్యేను సస్పెండ్ చేశారు. ఇది కచ్చితంగా బిగ్ టీవీ విజయమేనే చెప్పవచ్చు. ఒకప్పుడు టీవీ9 లాంటి చానల్స్ కి ఈ క్రెడిట్ ఉండేది. మరి ఇతర చానల్స్ వాళ్ళు అక్కడికి వెళ్లి ధైర్యం చేయలేకపోతున్నారా అనే విషయం ఆలోచించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: