జూనియర్ ఎన్టీఆర్ అలాగే చంద్రబాబు కుటుంబం మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా పరిస్థితులు నెలకొన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ అంటే చంద్రబాబు భార్య  నారా భువనేశ్వర్ కి అస్సలు నచ్చదని కొంతమంది ఈ ప్రచారం చేస్తూ ఉంటారు. ఇప్పటికీ అదే వాదన వినిపిస్తోంది. అయితే కావాలనే తనను... నందమూరి కుటుంబానికి దూరం చేస్తున్నారని...  జూనియర్ ఎన్టీఆర్ కూడా గ్రహించారని కొంతమంది చెబుతుంటారు. అందుకే గత కొన్ని రోజులుగా... నందమూరి అలాగే నారా కుటుంబానికి జూనియర్ ఎన్టీఆర్ దూరంగా ఉంటున్నారని వార్తలు వచ్చాయి.

సోషల్ మీడియా వేదికగా... ఆ రెండు కుటుంబాలకు ఏదైనా పండుగ జరిగితే శుభాకాంక్షలు చెప్పడం తప్ప... వాళ్ల ఇంటికి జూనియర్ ఎన్టీఆర్ వెళ్లడం లేదు. మొన్నటికి మొన్న నందమూరి బాలకృష్ణ 50 సంవత్సరాల పండుగకు కూడా... జూనియర్ ఎన్టీఆర్ వెళ్లలేదు. అయితే ఇలాంటి నేపథ్యంలో.. జూనియర్ ఎన్టీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అతి త్వరలోనే ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో...  జూనియర్ ఎన్టీఆర్ సమావేశం కాబోతున్నారట.

 రెండు తెలుగు రాష్ట్రాలలో వర్షాలు బీభత్సం సృష్టించిన సంగతి అందరికీ తెలిసిందే.  ముఖ్యంగా ఖమ్మం అలాగే విజయవాడలో వరదలు అల్లకల్లోలం సృష్టించాయి. ఈ నేపథ్యంలో వరద బాధితులను ఆదుకునేందుకు టాలీవుడ్ హీరోలు విరాళాలు ప్రకటించారు. ఇందులో భాగంగానే మొదటగా జూనియర్ ఎన్టీఆర్ స్పందించి వెంటనే రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు...  విరాళం ప్రకటించేశారు. జూనియర్ ఎన్టీఆర్ విరాళం ప్రకటించిన తర్వాత ఇండస్ట్రీ నుంచి హీరోలందరూ స్పందించి వెంట వెంటనే... విరాళం ఇచ్చేశారు.

 అయితే టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు అందరూ... తాము ప్రకటించిన విరాళాలను నేరుగా చంద్రబాబు నాయుడుకు ఇవ్వాలని అనుకుంటున్నారట. అయితే... ఇందులో జూనియర్ ఎన్టీఆర్ కూడా వారితో వెళ్ళనున్నారట. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పటివరకు జూనియర్ ఎన్టీఆర్ ఆయనను కలవలేదు. అందుకే టాలీవుడ్ పెద్దలతో కలిసి చంద్రబాబును కలవాలని జూనియర్ ఎన్టీఆర్ ఈ స్కెచ్ వేశారట. ప్రభుత్వంలో ఉన్న పార్టీకి... కచ్చితంగా అనుకూలంగా ఉండాల్సిందే. అందుకే ఆ వైపుగా జూనియర్ ఎన్టీఆర్ అడుగులు వేస్తున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: