తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, గులాబీ బాస్ కల్వకుంట్ల చంద్రశేఖర రావు... గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. గత తొమ్మిది నెలలుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. చేసిన తప్పిదాలను తెరపైకి తీసుకువచ్చి... ప్రజల మధ్య నిలదీసేందుకు కేసీఆర్ రంగం సిద్ధం చేసుకుంటున్నారు. దీనికి వినాయక చవితి ముహూర్తం పెట్టారు. వినాయక చవితి పండుగ పూర్తయిన తర్వాత... ప్రజా క్షేత్రంలోకి మరోసారి కల్వకుంట్ల చంద్రశేఖర రావు రాబోతున్నారు.

 

ఈ మేరకు ఇప్పటికే షెడ్యూల్ కూడా ఖరారు అయినట్లు సమాచారం.  బస్సు యాత్ర ద్వారా బయలుదేరి ప్రతి గ్రామంలో... ఒక మీటింగ్ పెట్టుకునేలా కేసీఆర్ రంగం సిద్ధం చేశారట.  అయితే ఈ యాత్ర సక్సెస్ కావాలని తాజాగా కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారని సమాచారం. ఇందులో భాగంగానే తన ఫామ్ హౌస్ లో... కల్వకుంట్ల చంద్రశేఖర రావు నవగ్రహ మహాయాగానికి కూర్చున్నారు.

పూజలు, దేవాలయాల దర్శనలో... కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఎప్పుడు ముందుంటారు. అయితే ప్రజాక్షేత్రంలోకి వెళ్లే ముందు....  తన ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో... కెసిఆర్ దంపతులు ప్రత్యేక పూజలు పాల్గొన్నారు. నవగ్రహ మహాయాగం  చేపట్టారు కేసీఆర్ దంపతులు. వేద పండితులతో కలిసి ఈ పూజలో పాల్గొన్నారు. ఇక కెసిఆర్ దంపతులు చేస్తున్న ఈ పూజలో కూతురు కల్వకుంట్ల కవిత కుటుంబం కూడా పాల్గొంది.

 2015 సంవత్సరంలో చండీయాగం చేసిన కేసీఆర్...  ఆ తర్వాత తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. 2018 అలాగే 2024లో రాజ్యశ్యామల యాగం చేశారు. అయితే 2024 సంవత్సరంలో కెసిఆర్ కు అదృష్టం కలిసి రాక... కొంతమంది టిఆర్ఎస్ ఎమ్మెల్యేల తప్పిదాల వల్ల గులాబీ పార్టీ ఓడిపోవడం జరిగింది. గులాబీ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా కూడా... అధికారం పక్షం లాగే అందరూ ఫీలవుతున్నారు. దానికి తగ్గట్టుగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా తప్పిదాలను చేస్తోంది.వాటిని నిలదీసేందుకు రంగంలోకి దిగుతున్నారు కేసీఆర్.

మరింత సమాచారం తెలుసుకోండి: