* నెల జీతాలు ప్రకటించిన వైసీపీ నేతలు
* కోటి రూపాయలు ప్రకటించిన జగన్
* నిత్యవరసర సరుకులు, వాటర్ బాటిళ్లు
రెండు తెలుగు రాష్ట్రాలలో.. గత శనివారం నుంచి బీభత్సంగా వర్షాలు పడుతున్న సంగతి తెలిసిందే. దీంతో రెండు రాష్ట్రాల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఏపీలోని విజయవాడ అటు తెలంగాణలోని ఖమ్మం జిల్లా పూర్తిగా మునిగిపోయాయి. ఈ నేపథ్యంలోనే ఆస్తి నష్టం అలాగే ప్రాణా నష్టం జరిగింది. విజయవాడలో 130 సంవత్సరాల తర్వాత ఈ స్థాయిలో వరద వచ్చినట్లు చెబుతున్నారు. అయితే... విజయవాడ ను వరదలు ముంచెత్తిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం... బాగా పని చేస్తుంది.
బాధితులకు ఫుడ్ తోపాటు... వారికి వసతి ఏర్పాట్లు కూడా చూస్తోంది. ఇలాంటి నేపథ్యంలోనే... వరద బాధితుల కోసం చాలామంది పెద్ద మనసుతో విరాళాలు కూడా ఇస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన చాలామంది సెలబ్రిటీలు... ఈ రాజకీయ నాయకులు విరాళాలు ఇవ్వడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ప్రతిపక్ష హోదాలో ఉన్న వైసిపి పార్టీ కూడా.. భారీ సహాయం చేసేందుకు ముందుకు వచ్చింది.
వైసిపి పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు అలాగే ఎమ్మెల్సీలు... జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. వరద బాధితుల కోసం... సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు. వైసిపి పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు అందరూ తమ నెల జీతం ప్రకటించేశారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ సీఎం పోకు సమాచారం కూడా అందించారు. ఇక ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి కోటి రూపాయల సహాయాన్ని తన తరఫున అందించడం జరిగింది.
అంతేకాకుండా... వైసీపీ పార్టీ.. తరపున వరద బాధితుల కోసం బాల పాకెట్లు అలాగే వాటర్ బాటిళ్లు కూడా పెద్ద ఎత్తున.... వైసిపి నేతలు పంచుతున్న సంగతి తెలిసిందే. ఇంకా వాళ్లకు ఎలాంటి అవసరం ఉన్న దగ్గరుండి ప్రతిపక్ష నేతలు చూసుకుంటున్నారు. విజయవాడ వరద బాధితులకు నిత్యవసర సరుకులు కూడా పంపిణీ చేస్తున్నారు వైసిపి నేతలు. ఇలాంటి నేపథ్యంలోనే వైసిపి పార్టీ ప్రజా ప్రతినిధులు తమ నెల జీతాలను ప్రకటించడం జరిగింది.