* భారీ వినాయక విగ్రహలలో గాజువాక వినాయకుడిది ప్రత్యేక శైలి

* ఖైరతాబాద్ వినాయక విగ్రహాన్ని సైతం తలదన్నేలా రూపకల్పన

* ఈ సారి మరింత ఆకర్షణగా విగ్రహం ఏర్పాటు


వినాయక చవితి ఈ పండుగకు మన హిందూ సాంప్రదాయంలో ఎంతో ప్రాధాన్యత వుంది... వినాయక చవితి వచ్చిందంటే చాలు పిల్లలు, పెద్దలు అందరూ కలసి ఎంతో ఉత్సాహముగా, కోలాహలంగా ఈ పండుగను జరుపుకుంటారు.సెప్టెంబర్ 7 నేడు వినాయకచవితి ఈ పండుగ కోసం వీరంతా ఎంతగానో ఎదురుచూస్తున్న రానే వచ్చింది..ఈ రోజున ఊరురూ మండపాలు కట్టి ప్రత్యేక పూజలు చేస్తారు.. వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఫలహారాలతో నైవేద్యం పెట్టి ఆ విఘ్నేశ్వరుడి ఆశీర్వాదం తీసుకుంటారు.. అయితే అన్ని పండుగలు ఉండగా వినాయకచవితికే ఎందుకు అంత స్పెషల్ అంటే..అన్ని విఘ్నాలకు అధిపతి ఆ విఘ్నేశ్వరుడు మనిషి తలపెట్టే ఏ పనిలో అయినా అవాంతరాలు ఎదురుకాకుండా ముందుగా వినాయకుడిని పూజిస్తాము.మన దేశంలో ఈ పండుగకు ఎంతో ప్రత్యేకత వుంది..


 బ్రిటిష్ కాలం నుండే వినాయకచవితి ఉత్సవాలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది..1892 లో ప్రజా వ్యతిరేక అసెంబ్లీ చట్టం ద్వారా హిందూ సమావేశాలపై బ్రిటిష్ ప్రభుత్వం నిషేధాన్ని విధించింది. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు అయిన లోకమాన్య తిలక్, బ్రిటీష్ వారిపై భారత స్వాతంత్ర్యోద్యమం మద్దతుగా ప్రజలందరిలో జాతీయ స్ఫూర్తి రగిలించే ఏ చిన్న అవకాశాన్ని కూడా వదిలిపెట్టలేదు. దేశవ్యాప్తంగా అందరినీ ఒక్కటి చేసే సంకల్పంతో ఇప్పుడు నిరంతరంగా సాగుతున్న గణపతి ఉత్సవాలు, శివాజీ ఉత్సవాలు మొదటిసారిగా ఆయనే ప్రారంబించాడు.. ఈ ఉత్సవాలు మనం నేటికి ఎంతో ఆడంబరంగా జరుపుకుంటున్నాము.. భారీ విగ్రహాలు ఏర్పాటు చేసుకొని నిత్యం పూజలు చేస్తున్నాం.. వినాయకుడి విగ్రహం ఎత్తు ప్రతి సంవత్సరం పెంచుకుంటూనే వున్నాం.. ఇప్పుడు అది కూడా ఒక రికార్డ్ గా మారింది..

తెలుగు రాష్ట్రాల నుండి ఈ సంవత్సరం అత్యంత ఎత్తైన గణేష్ ఎవరో చూడాలని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..అయితే 2012 నుండి భారీ గణేష్ విగ్రహాలను పెడుతూ వస్తున్న విశాఖపట్నం లోని గాజువాకకు మంచి పేరు వుంది..2023లో నిర్వాహకులు శ్రీ అనంత పంచముఖ మహా గణపతి రూపాన్ని ఏకంగా 117 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేశారు. ఇది భారతదేశంలోనే అత్యంత ఎత్తైన పర్యావరణ అనుకూల గణేష్ విగ్రహంగా గుర్తింపు పొందింది.. ఈ సంవత్సరం 100 అడుగుల ఎత్తులో శ్రీ మహా ఉచ్చిష్ట గణపతి ఏర్పాటు చేస్తున్నారు . గతేడాదితో పోలిస్తే ఎత్తు తక్కువే అయినా కూడా తెలుగు రాష్ట్రాలలో ఏ విగ్రహానికి లేనంత ఆకర్షణీయమైన విగ్రహంగా నిలువనుంది. ఇదిలా ఉంటే ఈ విగ్రహానికి మరో ప్రధాన ఆకర్షణగా బడా గణేష్ పక్కన అయోధ్య రామ్ లల్లా ఆలయ సెటప్‌ను నిర్వాహకులు రూపొందిస్తున్నారు.ఈసారి గాజువాకలోని లంక మైదానానికి అరకిలోమీటర్ దూరంలోని శ్రీనగర్ ప్రాంతంలో ఈ విగ్రహాన్ని ఉంచారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే విగ్రహాల నిమజ్జనంలో అగ్నిమాపక యంత్రాలు అలాగే వివిధ పవిత్ర నదుల నుండి తీసుకువచ్చిన పాలు మరియు నీటిని ఉపయోగించడం జరుగుతుందని వారు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: