నేడు వినాయక చవితి హిందువులందరూ జరుపుకునే పెద్ద పండుగలలో ఇది కూడా ఒకటి అన్న విషయం తెలిసిందే. వినాయక చవితి వచ్చింది అంటే చాలు ఊరువాడ అనే తేడా లేకుండా ప్రతి చోటా పండగ వాతావరణం నెలకొంటుంది. చిన్నలు పెద్దలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు  ఇలా వినాయక చవితి ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. గణనాధుని విగ్రహాన్ని ప్రతిష్టించుకుని తొమ్మిది రోజులపాటు నిష్టగా పూజలు చేసి ఇక ఊరేగింపుగా వెళ్లి గణనాథుని నిమజ్జనం చేయడం చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.


దీంతో ఎక్కడ చూసినా కూడా గణేశుడి మండపాలు దర్శనమిస్తూ ఉంటాయి. ఇక తమకు నచ్చిన గణనాథుడి విగ్రహాన్ని తీసుకొచ్చుకొని ప్రతిష్టించుకుంటూ ఉంటారు అని చెప్పాలి. అయితే నేడు వినాయక చవితి పూజలలో అటు దేశంలోని హిందువులందరూ కూడా మునిగిపోయారు. ఈ క్రమంలోనే గనపయ్య గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి అని చెప్పాలి. కేవలం వినాయక చవితి వచ్చినప్పుడు మాత్రమే కాదు.. ఎలాంటి కార్యక్రమం తలపెట్టాలి అన్న ముందు పూజ వినాయకుడిదే అన్న విషయం తెలిసిందే.


 ఇక ప్రతి పూజలోనూ వినాయకుడి పసుపు విగ్రహాన్ని తయారు చేస్తూ ఉంటారు. అయితే ఇలా వినాయకుడి పసుపు ప్రతిమను ఎందుకు తయారు చేస్తారు అనే విషయంపై పురాణాల్లో ఎన్నో గాదలు ఉన్నాయి. కానీ దీని వెనక సైంటిఫిక్ రీసన్ కూడా ఉందట. హైందవ సాంప్రదాయంలో పసుపుకు ఉన్న విశిష్టత అంతా కాదు. అందుకే గణేశా చవితి రోజున పసుపుతో చేసిన వరసిద్ధి వినాయకుడిని కొలుచుకుంటూ ఉంటారు. సహజంగా యాంటీ ఫంగల్ అయిన పసుపుతో చేసిన వినాయకుడిని నిమజ్జనం చేయడం ద్వారా చెరువుల్లోని రోగకారకాలు అంతమవుతాయట. చెరువులు కుంటలలోని నీటినే ప్రజలు అప్పట్లో కూడా తాగేవారూ. అందుకే ఇలా పసుపుతో కూడిన వినాయకుడిని నిమజ్జనం చేస్తే అందులోని రోగకారకాలు తగ్గిపోయి మంచి జరుగుతుందనే సైంటిఫిక్ రీసన్ కూడా ఇలా పసుపు గణపతి ప్రతిభను తయారు చేయడం వెనుక ఉందట. కాగా పార్వతి దేవి అమ్మవారు ముందుగా వినాయకుని పసుపు నలుగుతోనే తయారు చేశారు అన్నది పురాణాల్లో ఉన్న గాధ.

మరింత సమాచారం తెలుసుకోండి: