-వరద బాధితులకు అండగా హరీష్ రావు..
- ముగ్గురు మంత్రులు ఉన్నా సాయం సున్నా..
- వేలాదిమందికి నిత్యవసర సరుకుల పంపిణీ..


మొన్నటి వరకు కురిసినటువంటి కుండపోత వర్షాల వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైనటువంటి వరదలు వచ్చాయి. వాగులు వంకలు పొంగి పోర్లాయి. కొన్ని ప్రాంతాల్లో చెరువుల కట్టలు కూడా తెగిపోయాయి. ఇక ఈ వరదల దాటికి మున్నేరు డ్యాం విపరీతంగా ఉప్పొంగింది. దీంతో వరదల దాటికి ఖమ్మం జిల్లా మొత్తం మునిగిపోయింది. లోతట్టు ప్రాంతాల్లోకి విపరీతమైన నీరు రావడంతో ఇండ్లకు ఇండ్లే మునిగిపోయాయి. ప్రజలు కనీసం ఎక్కడికి వెళ్లాలో తెలియక బిక్కు బిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బ్రతుకుతున్నారు. ఇప్పటికి కూడా ఆ నీరు బయటకు వెళ్ళిపోలేదు. మరి అలాంటి ఖమ్మం బాధితులను కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకోవడంలో విఫలమైందని అనేక విమర్శలు వస్తున్నాయి. ఇదే తరుణంలో మాజీ మంత్రి హరీష్ రావు పెద్దమనస్సు చాటుకున్నాడు. వరద బాధితుల కోసం తన వంతు సాయం చేశాడు. మరి ఆయన ఏం చేశాడో ఆ వివరాలు చూద్దాం.

 సాయం చేసిన సిద్దిపేట:

 ఖమ్మం జిల్లాలో నిరాశ్రయులైన వరద బాధితులను చూసి  మాజీ మంత్రి హరీష్ రావు చలించి పోయారు.  సొంతంగా సిద్దిపేట తరపున వరద బాధితుల కోసం 200 క్వింటాళ్ల సన్న బియ్యం, 2000 కిట్ల కిరాణా సామాగ్రి, 500 దుప్పట్లు, 2000 బ్రెడ్ ప్యాకెట్లు, కూరగాయలు,నిత్యవసర సరుకులన్నింటినీ కలిపి మూడు వ్యాన్లలో ఖమ్మం పంపించారు. సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుంచి స్టార్ట్ అయిన ఈ వ్యాన్లు నేరుగా ఖమ్మం వెళ్ళిపోయాయి.  అయితే వరద బాధితులకు సహకారం అందించడం కోసం సిద్దిపేటకు చెందినటువంటి వ్యాపారవేత్తలు, స్వచ్ఛంద సంస్థలు, కొంతమంది నాయకులు కలిసి ఈ సహకారం అందించారని హరీష్ రావు తెలియజేశారు.  


ఈ విధంగా హరీష్ రావు ప్రజలు ఆపదలో ఉంటే తన వంతు సహకారం అందిస్తూ వస్తున్నారు.  అంతే కాదు ఆయన మహబూబాబాద్ కి కూడా నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. ఈ విధంగా  ఖమ్మం బాధితులకు అండగా నిలిచారని చెప్పవచ్చు. అంతేకాదు ఖమ్మంలో సర్వం కోల్పోయినటువంటి బాధితులకు 2 లక్షల రూపాయల తక్షణ సాయం అందించాలని డిమాండ్ చేశారు. ఈ విధంగా తన వంతు సాయం అందించిన హరీష్ రావు ఖమ్మం వరదల్లో రియల్ హీరోగా నిలిచారని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: