తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని... ప్రజాక్షేత్రంలో గులాబీ పార్టీ ప్రతి విషయంలోనూ నిలదీయ గలుగుతోంది. అయితే ఇలాంటి నేపథ్యంలో పానకంలో పుడకలాగా... తెరపైకి వచ్చారు కరీంనగర్ ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్. కెసిఆర్ ప్రభుత్వంలో... టిఆర్ఎస్ నేతలనే తిట్టిన.. బండి సంజయ్ కుమార్... ఇప్పుడు కూడా కెసిఆర్ నే తిడుతున్నారు.


తాజాగా... కెసిఆర్ నిర్మించిన తెలంగాణ సచివాలయం పై హాట్ కామెంట్స్ చేశారు బండి సంజయ్ కుమార్. తెలంగాణ సచివాలయంలో నిర్మించిన డోమ్లను... కూల్చేస్తామని సంచలన ప్రకటన చేశారు బండి సంజయ్ కుమార్. గులాబీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇవే వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్ కుమార్. మళ్లీ.. ఇప్పుడు అదే తంతును తెరపైకి తీసుకువస్తున్నారు.


ఖమ్మం వరద ప్రభావిత ప్రాంతాలలో...  తెలంగాణ డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి భట్టి విక్రమార్క అలాగే శివరాజ్ సింగ్ తో కలిసి బండి సంజయ్ కుమార్ ఏరియల్ సర్వే నిర్వహించారు.  అనంతరం తెలంగాణ సచివాలయం కు చేరుకున్న ఈ నేతలు...  ఖమ్మం వరద బాధితులపై సమీక్ష నిర్వహించారు. అనంతరం బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. సచివాలయం  కు తాను తొలిసారిగా వచ్చానని బండి సంజయ్ తెలిపారు.


అయితే కేసీఆర్ నిర్మించిన తెలంగాణ సచివాలయంలో ఉద్యోగులకు...  సరైన రూములు ఆరోపణ లు చేయడం జరిగింది. చిన్న చిన్న గ దులు కట్టి వాళ్లను అందులో కూర్చోబెట్టాడని.. మండిపడ్డారు. తెలంగాణ సచివాలయం మొత్తం డోమ్లే కనిపిస్తున్నాయని.... దానివల్ల రూములు చిన్న గా అయ్యాయని... బండి సంజయ్ పేర్కొన్నారు. అయితే తెలంగాణలో త్వరలోనే బిజెపి ప్రభుత్వం వస్తుందని.. తాము అధికారం లోకి వచ్చాక తెలంగాణ సచివాలయం డోమ్లు ధ్వంసం చేస్తామని హెచ్చరించారు. మరి దీనిపై గులాబీ పార్టీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: