ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అటు శ్రీకాకుళం నుంచి ఇటు చిత్తూరు వరకు ఎక్కడ చూసినా వరదల హంగామా నడుస్తోంది. ప్రభుత్వ యంత్రాంగం అంతా వరద సహాయక చర్యలలో నిమగ్నమై పని చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న మంత్రులు ... ఎమ్మెల్యేలు అందరికీ చంద్రబాబు విజయవాడలో డివిజన్ల వారీగా ఇన్చార్జిలుగా నియమించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే లు మాత్రమే కాకుండా కూటమి ఎమ్మెల్యేలు అందరూ విజయవాడ మహానగరంలో తమకు కేటాయించిన డివిజన్లో సహాయక కార్యక్రమాలు పర్యవేక్షిస్తూ ప్రభుత్వ కార్యక్రమాలు శరవేగంగా జరిగేలా చూస్తున్నారు.
ఇలా ప్రభుత్వ యంత్రాంగం ఎక్కడ చూసిన వరద సహాయక చర్యల లో పనిచేస్తుంది. అయితే ఈ సహాయక చర్యలను చేపట్ట డం లో ప్రభుత్వం ఫెయిల్ అయిందంటూ మాజీ మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నగరి నియోజక వర్గ ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ నాయుడు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వ సహాయక చర్లపై ప్రజల నుంచి సైతం ప్రసంసలు వస్తుంటే రోజా మాత్రం విమర్శలు చేయడం ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నానని ఆయన మండిపడ్డారు. భారీ వర్షాల కారణంగా వరదల ముంచెత్తడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఈ సమయంలో రాజకీయాలు మాని సహాయక చర్యలు చేపట్టేందుకు ముందుకు రావాల్సిన వైసిపి నేతలు లేనిపోని విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వరద సహాయక చర్యలపై రోజా ఏం మాట్లాడుతున్నారో ఆమెకే తెలియట్లేదన్నారు. ఆడుదాం ఆంధ్రా పేరుతో గత ప్రభుత్వంలో విపరీతమైన దోపిడి చేశారని భాను విమర్శించారు. రు. 350 బ్యాట్లను రు. 3500 - రు. 6500 కు కొనుగోలు చేసినట్లు చూపించారన్నారు.. ప్రజల సొమ్మును దోచుకునేందుకు ఆడుదామా ఆంధ్ర కార్యక్రమాన్ని చేపట్టారని గాలి భాను ప్రకాష్ నాయుడు విమర్శించారు. రోజా మాత్రమే కాదు.. వైసీపీ హయాంలో అవినీతికి పాల్పడిన ఎవరిని కూటమి ప్రభుత్వం వదలబోమని, తప్పు చేసిన వారు చిప్పకూడు తినాల్సిందేనన్నారు భాను ప్రకాష్..!