* టీడీపీ నుంచి కోనేటి ఆదిమూలం సస్పెండ్
* కాంగ్రెస్ నుంచి రాజకీయ అరంగేట్రం
* వైసీపీ, టీడీపీలో పనిచేసిన అనుభవం
* 2024 ఎన్నికల కంటే టీడీపీలోకి జంప్
* టీడీపీ మహిళా నేతకు వేధింపులు

 
కొంతమంది రాజకీయ నేతలు చిన్నచిన్న తప్పిదాలు చేసి పార్టీ నుంచి సస్పెండ్ అవుతూ ఉంటారు. మరి కొంతమంది నేతలు.. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడి పార్టీ నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. అయితే.. తాజాగా టిడిపి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలo మాత్రం.... తన వయసుకు సంబంధం లేని పని చేసి మరీ తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ కావడం జరిగింది. ఓ మహిళ కార్యకర్తపై అఘాయిత్యం చేసిన... సంఘటనలో.. సస్పెండ్ కు గురయ్యారు.

 
గ్రామ సర్పంచి నుంచి ఎమ్మెల్యే స్థాయికి ఎదిగిన కోనేటి ఆదిమూలం... చాలా కష్టపడి పైకి వచ్చారు. 1952 టైం లో జన్మించిన... ఈ చిత్తూరు జిల్లా సీనియర్ రాజకీయ నాయకులు కోనేటి ఆదిమూలం... కాంగ్రెస్ నుంచి తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. 1977 సంవత్సరంలో కాంగ్రెస్లో జాయిన్ అయిన ఆదిమూలం.... మొట్టమొదటిగా గ్రామ సర్పంచిగా విజయం సాధించారు. క్రమంగా జడ్పిటిసి స్థాయికి ఎదిగారు.

 
అయితే 2001లో టిడిపిలో చేరిన ఆయన... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత వైసీపీలో  చేరిపోయారు.  అయితే వైసీపీ నుంచి చాలా సార్లు జగన్మోహన్ రెడ్డి ఆదిమూలం కు ఛాన్సులు ఇచ్చారు. మొదటిసారి ఓడిపోయిన ఆదిమూలం... 2019 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఎమ్మెల్యేగా వైసిపి తరఫున విజయం సాధించారు. ఆ సమయంలో తంబళ్లపల్లె నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది.

 
అయితే 2024 అంటే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల సమయానికి.. టికెట్ రాదని ముందే ఊహించి టిడిపిలో చేరిపోయారు. దీంతో సత్య వేడు  ఎమ్మెల్యే టికెట్ కోనేటి ఆదిమూలం కు చంద్రబాబు  నాయుడు ఇవ్వడం జరిగింది. అయితే ఆయన ఎమ్మెల్యేగా గెలిచి... మూడు నెలలు కూడా కాలేదు... మహిళా కార్యకర్తపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో వెంటనే చంద్రబాబు నాయుడు ఆదిమూలంపై.. సస్పెండ్ వేటు వేశారు. ఈ సస్పెండ్ తో ఆదిమూలం రాజకీయ భవిష్యత్తు... పూర్తిగా క్లోజ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన త్వరలోనే ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయబోతున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: