* తెలంగాణ ఉద్యమకారుడిగా రఘునందన్ గుర్తింపు
* కేసీఆర్ శిష్యుడిగా మంచి పేరు
* 2013 లో trs నుంచి సస్పెండ్
* చంద్రబాబుతో రహస్య చర్చలు
* బీజేపీలో ఎంపీగా రఘునందన్ చరిత్ర

 రెండు తెలుగు రాష్ట్రాలలో చాలామంది రాజకీయ నాయకులు... పార్టీలు మారిన సంగతి తెలిసిందే. కొంతమంది.. చిన్నచిన్న తప్పిదాలు చేసి పార్టీ నుంచి సస్పెండ్ కావడం మనం చూసాం. ఇక మరికొంతమంది... అన్నం పెట్టిన పార్టీకే సున్నం పెట్టి బయటకు వస్తున్నారు. కానీ పార్టీ కార్యకలాపాలకు వ్యతిరేకంగా... పనిచేసే సస్పెండ్ కు గురైన కొంతమంది నేతలు... రెండు తెలుగు రాష్ట్రాల్లో స్పష్టంగా కనిపిస్తున్నారు.


అలాంటి వారిలో బిజెపి పార్లమెంటు సభ్యులు రఘునందన్ రావు ఒకరు. రఘునందన్ రావు పేరు చెప్పగానే అందరికీ మొదటగా కెసిఆర్  మాత్రమే అందరికీ గుర్తుకు వస్తారు. కెసిఆర్ ను చూసి.. రాజకీయాల్లోకి వచ్చారు రఘునందన్ రావు. ఈ విషయాన్ని ప్రతి ఇంటర్వ్యూలో కూడా రఘునందన్ రావు చెప్పడం జరిగింది. ఆయన ప్రస్తుతం బిజెపిలో ఉన్నప్పటికీ... కెసిఆర్ ను నిత్యం మెచ్చుకుంటారు.

 

అయితే అలాంటి రఘునందన్ రావు టిఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. 2001 నుంచి టిఆర్ఎస్ పార్టీలో కొనసాగిన రఘునందన్ రావు... ప్రస్తుతం లాయర్ గా కూడా పనిచేస్తున్నారు. అయితే టిఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు.. అంటే దాదాపు 2013 ఆ సమయంలో... చంద్రబాబుతో రహస్యంగా సమావేశం అయ్యారని రఘునందన్ రావు పై ఆరోపణలు వచ్చాయి. దీంతో రఘునందన్ రావు ను టిఆర్ఎస్ పార్టీ నుంచి కేసీఆర్ సస్పెండ్ చేయడం జరిగింది.

ఇక ఆ తర్వాత కాంగ్రెస్లో చేరిన రఘునందన్ రావు.. బిజెపిలో సెటిల్ అయ్యారు. అంతేకాదు బిజెపిలోకి వెళ్లిన తర్వాత..  దుబ్బాక ఎమ్మెల్యేగా పనిచేశారు. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో... మెదక్ ఎంపీగా కూడా పోటీ చేసి ఈ రఘునందన్ రావు విజయం సాధించడం జరిగింది. టిఆర్ఎస్ పార్టీ కంచుకోట ఆయన మెదక్ నియోజకవర్గంలో ఎంపీగా... రఘునందన్ రావు విజయం సాధించి... చరిత్ర సృష్టించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: