* గెలిచే పార్టీని వీడి ఓడిపోయే పార్టీలో చేరిన వల్లభనేని

* వైసిపి ఓడిపోవడంతో ఆయనకి షాక్

* ఇప్పుడు పరిస్థితి దారుణం..

( ఏపీ ఇండియా - హెరాల్డ్ )

వైసీపీ సీనియర్ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ హీరో నుంచి జీరో అయ్యారు. ఆయన పరిస్థితి రెంటికీ చెడిన రేవడిగా మారుతుంది. ఈయన వివిధ కారణాల వల్ల టీడీపీ అధినేత చంద్రబాబుపై తిరుగుబాటు చేశారు. పార్టీకి వ్యతిరేకంగా గొంతు విప్పి పక్కలో బాంబ్‌లా వ్యవహరించారు. బాబుతో చెడినా, పార్టీకి దూరమైనా అప్పట్లో ఆయన ఎమ్మెల్యే పదవికి మాత్రం రాజీనామా చేయలేదు. టీడీపీకి తిరుగుబాటు చేసిన వెంటనే జగన్మోహన్ రెడ్డి తమను నెత్తిన పెట్టుకుంటారని వైసీపీలో చేర్చుకుంటారని వల్లభనేని వంశీ భావించారు కానీ అలా జరగలేదు.

అనధికారికంగా వైసీపీతోనే వంశీ ఉన్నారు కానీ గన్నవరం నియోజకవర్గంలో వంశీ ఆధిపత్యాన్ని అక్కడి వైసీపీ నేతలు అస్సలు అంగీకరించలేదు. కొడాలి నాని చెప్పడంతో చివరికి గన్నవరం నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు జగన్. అయితే టీడీపీ కూటమి సునామీలో యార్లగడ్డ వెంకటరావు చేతిలో 37,628 ఓట్ల తేడాతో ఓడిపోయారు వంశీ. వైసీపీ జస్ట్ 11 సీట్లతో పతనం అయింది. వంశీ టీడీపీకి ఎదురు తిరగకుండా, పార్టీలోనే మంచిగా ఉండి ఉంటే ఇప్పుడు ఆయన రాజు లాగా బతికేవారు. ఏపీ నుంచి ఎక్కడికి వెళ్లి పోవాల్సిన అవసరం వచ్చి ఉండేది కాదు. హాయిగా ఐదేళ్లపాటు అధికారంలో ఉంటూ చక్రం తిప్పి ఉండేవారు కానీ ఆయన అదృష్టం బాగోలేదు. గెలిచే పార్టీని వీడి ఓడిపోయే పార్టీలో చేరారు. చివరికి వైసీపీ టీడీపీ ఆఫీస్‌పై దాడి ఘటనలో ఆయనను అరెస్ట్ కూడా చేశారు.

హీరో లా బతకాల్సిన ఈ నేత ఇప్పుడు జీరో అయిపోయారు. ఏపీ వదిలి ఎక్కడో తల దించుకోవాల్సిన పరిస్థితి నెలకొన్నది. బాబు గెలుస్తారని కొడాలి నాని వంశీ అసలు ఊహించలేదు అందుకే వాళ్ళు రెచ్చిపోయారు. అదే ఇప్పుడు వారికి చాలా మైనస్ అయింది. టీడీపీ గెలుపు తర్వాత వంశీకి తగిలిన షాక్ మరెవరికి తగిలి ఉండదని చాలామంది రాజకీయ విశ్లేషకులు కూడా కామెంట్లు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: