-బీఆర్ఎస్ సస్పెండ్ చేసిన బిజెపిలో  టాప్.
- మల్కాజ్ గిరి ఎంపీగా  సంచలనం..
- కేసీఆర్ వదులుకొని తప్పు చేశారా .?


ఈటెల రాజేందర్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తిరుగులేని లీడర్. ఆయన ఏదో ఓ పార్టీని బేస్ చేసుకుని ఎదిగిన వ్యక్తి కాదు. సొంతంగా తనకు తాను ఇమేజ్ పెంచుకొని పేద ప్రజలకు దగ్గరై రాజకీయాల్లో రాణిస్తున్న ఘనుడు. అలాంటి ఈటల రాజేందర్ ఎక్కువ కాలం పని చేసిన పార్టీ బీఆర్ఎస్ అని చెప్పవచ్చు. ఒకప్పుడు రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర నినాదాలు అసెంబ్లీలో వినిపించిన ధైర్యశాలి. అప్పటినుంచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించే వరకు అలుపెరుగని పోరాటం చేశారు. అసలు తెలంగాణలో కెసిఆర్ తర్వాత టిఆర్ఎస్ లో అంత పెద్ద లీడర్ ఎవరైనా ఉన్నారు అంటే ఆయన ఈటల రాజేందర్ అని చెప్పవచ్చు. అలాంటి సీనియర్ నేత టిఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేలా చేసి రాష్ట్రంలో రెండు పర్యాయాలు అధికారంలోకి తీసుకువచ్చి చివరికి అదే పార్టీ నుంచి సస్పెండ్ అయ్యాడు. మరి పార్టీ నుంచి బయటకు వచ్చిన ఈటెల సైలెంట్ అయితే కాలేదు. ఆయనను ఏ విధంగా బయటకు పంపారో అంతకంటే ఎక్కువ స్థానాన్ని బిజెపి ద్వారా సంపాదించుకున్నారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా తను అనుకున్న లక్ష్యం చేరే దిశగా ముందుకు వెళ్తున్నారు. రాజు ఎక్కడున్నా రాజే అనే విధంగా ఈటల రాజన్న ఇటు బిఆర్ఎస్ లో ఉన్న అటు బిజెపిలో ఉన్న రాజరికాన్ని మాత్రం మెయింటైన్ చేస్తూ వస్తున్నారని చెప్పవచ్చు. అలాంటి ఈటల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం..

 కెసిఆర్ కు నచ్చలేదు:
ఉద్యమ కాలం నుంచి కేసీఆర్ వెన్నంటే ఉంటూ వచ్చారు ఈటల రాజేందర్. నిజానికి కెసిఆర్ తర్వాత ఏ స్థానమైన సరే ఈటల రాజేందర్ కి ఇవ్వాలి.  కానీ కెసిఆర్ మాత్రం అలా చేయకుండా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేటీఆర్ కు ప్రథమ స్థానం ఇచ్చారు. కేవలం వైద్య శాఖ మంత్రిగా మాత్రమే ఈటెల రాజేందర్ కి ఇచ్చారు.  అలాంటి ఈ తరుణంలో ఈటెల రాజేందర్ ఒక సందర్భంలో కేటీఆర్ పై పలు విమర్శలు చేశారట. ఈ విషయం సీక్రెట్ గా తెలుసుకున్న కేసీఆర్  ఎలాగైనా ఈటెలను పార్టీ నుంచి బయటకు పంపించాలని ప్లాన్ వేసి  చివరికి పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అంతేకాదు ఆయన ప్రభుత్వ భూముల కబ్జా చేశారని ఒక ఆరోపణ కూడా తీసుకొచ్చారు.  ఈ విధమైన ఆరోపణలతో ఈటల రాజేందర్ ను టిఆర్ఎస్ నుంచి పూర్తిగా సస్పెన్షన్ వేటు వేశారు. అయినా వెనుతిరుగని ఈటెల రాజేందర్ మళ్లీ హుజరాబాద్ బై ఎలక్షన్స్ లో బిజెపి నుంచి పోటీ చేసి గెలుపొందారు. అలాంటి ఆయన ప్రస్థానం ఎప్పటి నుంచి సాగింది అనే వివరాల్లోకి వెళితే..ఈయన 2003లో టిఆర్ఎస్ పార్టీలో చేరారు.  2004లో కమలాపూర్ అసెంబ్లీ కాన్స్టెన్సీ నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. అలా ఆంధ్రప్రదేశ్ శాసనసభలో కొన్నాళ్లు ఫ్లోర్ లీడర్ గా కూడా పనిచేశారు.  తర్వాత 2008లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్లి మళ్లీ గెలుపొందారు.


 ఇక 2009లో కమలాపూర్ నియోజకవర్గాన్ని హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో కలిపేశారు. మళ్లీ 2009లో  హుజురాబాద్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. మళ్లీ 2010లో రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో గెలిచారు. 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పుడు ఆయన మొదటిసారి కెసిఆర్ మంత్రివర్గంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు. మళ్లీ 2018లో మరోసారి గెలిచి  కెసిఆర్ మంత్రివర్గంలో ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. ఈ క్రమంలోనే 2021 లో  కెసిఆర్ కు ఈటలకు కాస్త విభేదాలు రావడంతో కాస్త పార్టీకి దూరమవుతూ వచ్చారు. పార్టీలో ఉంటూ పార్టీ పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు మరియు జమున హెచరీస్ తో కలిసి మెదక్ జిల్లాలోని అచ్చంపేట, అకింపేటలో భూ అక్రమణులు చేశారనే ఆరోపణలు చేసి ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఆ తర్వాత ఆయన కిషన్ రెడ్డి సమక్షంలో బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. అలా హుజురాబాద్ లో మరోసారి పోటీ చేసి ఉప ఎన్నికల్లో  గెలుపొందాడు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి హుజరాబాద్ గజ్వేల్ నుంచి పోటీ చేసి రెండు చోట్ల ఓడిపోయారు. ఆ తర్వాత లోక్సభ ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచి పోటీ చేసి సునీత మహేందర్ రెడ్డి పై  దాదాపు నాలుగు లక్షల మెజారిటీతో ఎంపీగా గెలుపొంది సంచలనం సృష్టించారు. ఈ విధంగా ఈటెల రాజేందర్ ఎక్కడున్నా రాజు లాగే బతుకుతాడు తప్ప  కిందికి అయితే రాలేదని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: