- కేసీఆర్ నమ్మిన బంటుగా ఎదిగిన రాములు నాయక్..
- బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు స్టార్ అయ్యారు.
- కాంగ్రెస్ లో జీరో...


 రాజకీయాల్లో  అభిమానాలు అనేవి ఉండవు. ఎదగడం కోసం సొంత వారినైనా తొక్కాల్సిందే. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు ఎవరి రాజకీయ భవిష్యత్తు కోసం వారే చూసుకుంటారు తప్ప వారు నాన్న, వాళ్ళు  నా తమ్ముళ్లు,నా ఫ్రెండు అనే ఫీలింగ్స్ ఉండవు.  ఆ విధంగానే తెలంగాణ రాష్ట్ర రాజకీయ పరిస్థితులు ఉన్నాయని చెప్పవచ్చు. కొంతమంది పార్టీకి ఎంతో పనిచేసినా చివరికి ఎలాంటి పదవులు లేకుండా పార్టీకి దూరమవుతూ ఉంటారు.  పార్టీకి వ్యతిరేకంగా పనిచేసి చివరికి అధికారంలోకి వచ్చే ముందు పార్టీలోకి వచ్చి మంచి పదవులు లాగేస్తుంటారు. అలా రాజకీయాల్లో బండ్లు ఓడలు అవుతాయి ఓడలు బండ్లు అవుతాయి అనే సామెతకు  పర్ఫెక్ట్ నిదర్శనం అని చెప్పవచ్చు.  అలాంటి రాజకీయాల్లో ఎంతో కాలం నుంచి ఉన్నటువంటి బంజారా నాయకుడు రాములు నాయక్  ఒకప్పుడు కెసిఆర్ కు నమ్మిన బంటులా ఉండేవాడు.  చివరికి బీఆర్ఎస్ పార్టీ అతన్ని సస్పెండ్ చేయడంతో కాంగ్రెస్ పార్టీలో చేరి ఎటూ కాకుండా పోయాడు. అలాంటి రాములు నాయక్ గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం..

 రాములు నాయక్ ప్రస్థానం:

కొంతమంది పార్టీల నుంచి సస్పెండ్ అయ్యి ఇతర పార్టీలో చేరి వారి రాజకీయ భవిష్యత్తును చక్కగా తీర్చిదిద్దుకుంటారు.. మరి కొంతమంది నమ్మిన పార్టీ సస్పెండ్ చేయడంతో ఎటు కాకుండా పోతారు. అలాంటి వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్.. తొలి దశ తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొని కెసిఆర్ కు చాలా దగ్గర అయ్యాడు. 2001లో కేసీఆర్ స్థాపించిన పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితిలో ఒకరిగా ఉన్నాడు.  అలా ఉద్యమ కాలమంతా కేసిఆర్ వెన్నంటే ఉంటూ ఎన్నోసార్లు అరెస్టయి జైలు పాలయ్యాడు. అలాంటి రాములు నాయక్ రాజకీయ ప్రస్థానం చాలా చక్కగా సాగింది.  అయితే రాములు నాయక్ ఒక ప్రభుత్వ ఉద్యోగి. ఈయన ఒకానొక సమయంలో రాజకీయాలకు ఆకర్షితులై కాన్సిరాం స్థాపించిన బహుజన సమాజ్వాది పార్టీ ద్వారా  రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. తర్వాత కేసీఆర్ వెంట నడిచి  నమ్మిన బంటుగా ఎదిగాడు.


 తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బోత్ నియోజకవర్గం నుంచి  ఎస్టీ రిజర్వేషన్ టికెట్ కోసం ప్రయత్నించిన అది సఫలం కాలేదు. చివరికి తెలంగాణ రాష్ట్ర సమితి గవర్నర్ కోటాలో నారాయణఖేడ్ శాసనమండలికి ఎమ్మెల్సీగా నామినేట్ చేసింది. 2014 నుంచి మొదలు 2018 వరకు ఎమ్మెల్సీగా సేవలందించారు. అలా చేస్తున్న క్రమంలోనే 2018లో రాములు నాయక్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడని ఆయనపై టిఆర్ఎస్ అధిష్టానం వేటు వేయడంతో పార్టీ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీలో చేరాడు. ఆ తర్వాత ఖమ్మం,వరంగల్, నల్గొండ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయాడు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి పదవి లేకుండా రాములు నాయక్ ఉన్నాడని చెప్పవచ్చు. ఈ విధంగా టిఆర్ఎస్ లో స్టార్ గా ఉండే ఈయన కాంగ్రెస్ లోకి వచ్చి జీరో అయిపోయాడని చాలామంది అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: