హైదరాబాద్ మహానగరంలో హైడ్రా విధ్వంసం మళ్లీ మొదలైంది. మొన్నటి వరకు వర్షాలు పడడంతో కాస్త చల్లబడ్డ అధికారులు... ఆదివారం ఉదయం నుంచి మళ్లీ కూల్చివేతలు ప్రారంభించారు. మాదాపూర్, అయ్యప్ప సొసైటీ, హైటెక్ సిటీ అలాగే గచ్చిబౌలి ప్రాంతాలలో... ఇవాళ ఉదయం నుంచి హైడ్రా అధికారులు... అక్రమంగా నిర్మించిన కట్టడాలను కూల్చి వేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే...  టాలీవుడ్ బడా నటుడు.. మురళీమోహన్ కు కూడా నోటీసులు ఇచ్చారు.


ఇలాంటి నేపథ్యంలోనే వైయస్ జగన్మోహన్ రెడ్డికి మరో ఎదురు దెబ్బ తగిలింది. వైసిపి నేతల... కట్టడాలను ధ్వంసం చేసేందుకు హైడ్రా రంగంలోకి దిగింది. వైసిపి మాజీ ఎమ్మెల్యే అయిన కాటసాని రాంభూపాల్ రెడ్డి టార్గెట్ గా హైడ్రా  పని చేస్తోంది. ఇందులో భాగంగానే.. కూల్చివేతలు ప్రారంభించింది హైడ్రా.  సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ లోని పెద్ద చెరువు FTL , బఫర్ జోన్ లలో అక్రమ నిర్మాణాలను  కూల్చివేస్తున్నారు హైడ్రా అధికారులు.


ఇందులో ముఖ్యంగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డికి సంబంధించిన నిర్మాణాలను నేలమట్టం చేశారు హైడ్రా అధికారులు.  హైడ్రా కమిషనర్ రంగనాథ్  వారం రోజుల కిందట సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ లోని పెద్ద చెరువు FTL , బఫర్ జోన్ లలో అక్రమ నిర్మాణాలను పరిశీలన చేశారట. ఇక ఇవాళ ఉదయం నుంచే కూల్చివేతలు ప్రారంభించారు.  


ఇక అటు మాదాపూర్ సున్నం చెరువు వద్ద అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు హైడ్రా అధికారులు.  దీంతో కూల్చివేతల వద్ద హైడ్రామా నెలకొంది. పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు ఇద్దరు వ్యక్తులు. వారిపై నీళ్ళు పోసి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దీంతో సంఘటన స్థలానికి భారీగా చేరుకున్నారు స్థానికులు. పెద్ద ఎత్తున మోహరించిన పోలీసులు వచ్చి.. అక్కడి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. వారం నుంచి 15 రోజుల పాటు గడువు ఇచ్చామని... అంతలోపు ఖాళీ చేయాలని.. గడువు దాటిన తర్వాత తామే కూల్చివేస్తమని చెబుతున్నారు హైడ్రా అధికారులు.

మరింత సమాచారం తెలుసుకోండి: