ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గతేడాది ఏపీ సీఐడీ నమోదు చేసిన కేసుల వల్ల జైలు జీవితం గడిపిన సంగతి తెలిసిందే. చంద్రబాబు అక్రమ అరెస్ట్ కు ఏడాది కాగా ఆ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అవినీతి, అక్రమ సంపాదన కేసులలో జగన్ ఏ1 నిందితుడు కాగా జగన్ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు అవినీతి చేశాడని ప్రూవ్ చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు.
 
అమానవీయ పరిస్థితులలో గతేడాది ఇదే రోజున చంద్రబాబు నాయుడు అరెస్ట్ కావడం జరిగింది. ఆ సమయంలో టీడీపీ శ్రేణులు పెద్దఎత్తున రోడ్లపైకి వచ్చి పోలీస్ దిగ్భంధాలను అధిగమించి ఆందోళన చేయడం జరిగింది. చంద్రబాబు అరెస్ట్ ను ఇతర రాజకీయ పార్టీలు ఖండించడంతో పాటు తెలుగు ప్రజలంతా చంద్రబాబుకు ఆ సమయంలో సంఘీభావం తెలిపిన సంగతి తెలిసిందే.
 
చంద్రబాబు అరెస్ట్ వల్ల వైసీపీకి ప్రస్తుతం 11 స్థానాలు మాత్రమే మిగిలాయి. రాజకీయ చరిత్రలో కనీవిని ఎరుగని పరాజయం వైసీపీకి సొంతం కావడానికి జగన్ పాలన ఒక విధంగా కారణం కాగా చంద్రబాబును అరెస్ట్ చేయించడం మరో కారణమని చాలామంది భావిస్తారు. 2023 సంవత్సరం సెప్టెంబర్ 8వ తేదీన చంద్రబాబు బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ సభలో పాల్గొన్నారు. ఆ సమయంలో సెప్టెంబర్ 9వ తేదీ ఉదయం 6 గంటలకు చంద్రబాబును నిద్ర లేపి అరెస్ట్ చేయడం జరిగింది.
 
ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థకు కేటాయించిన నిధుల వినియోగంలో దుర్వినియోగం జరిగిందని సీఐడీ విభాగం చంద్రబాబుపై కేసు బనాయించి అరెస్ట్ చేయడం జరిగింది. ఆ సమయంలో పోలీసులు పవన్ కళ్యాణ్ ను సైతం అడ్డుకోవడం జరిగింది. ఆ సమయంలో 70 వేల మందికి పైగా ఐటీ ఉద్యోగులు బాబు అరెస్ట్ కు వ్యతిరేకంగా ర్యాలీని చేపట్టడం జరిగింది. తర్వాత రోజుల్లో చంద్రబాబు నాయుడు బెయిల్ పై విడుదలయ్యారు.




మరింత సమాచారం తెలుసుకోండి: