ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో బుడమేరు భీభత్సాన్ని ఏపీ ప్రజలు సులువుగా మరిచిపోలేరనే సంగతి తెలిసిందే. అయితే 60 సంవత్సరాల క్రితం కూడా దాదాపుగా ఇదే తరహా ఘటన చోటు చేసుకుంది. అజిత్ సింగ్ నగర్, సత్యనారాయణపురం ప్రాంతాలలో బుడమేరు సృష్టించిన వరద భీభత్సం అంతాఇంతా కాదు. ఆ సమయంలో అనధికారిక లెక్కల ప్రకారం దాదాపుగా 10 మంది గల్లంతు కావడం జరిగింది.
 
ఆ సమయంలో పెద్ద సంఖ్యలో పశువులు సైతం కొట్టుకునిపోయాయి. వేల మంది నిరాశ్రయులు కావడంతో పాటు వరద నుంచి రక్షణ కొరకు అప్పట్లో యంత్రాంగం కొన్ని కీలక సూచనలు చేయడం జరిగింది. బుడమేరు రక్షణ కట్టకు అర్ధరాత్రి సమయంలో గండి పడటంతో అజిత్ సింగ్ నగర్ ప్రాంతం అంతా వరద ముంపునకు గురైంది. ఆ సమయంలో దాదాపుగా 2000 కంటే ఎక్కువ గుడిసెలు జలమయం కావడం జరిగింది.
 
అక్కడ ఉన్న డాబాపైకి ఎక్కి ఆ సమయంలో ప్రజలు తమ ప్రాణాలను రక్షించుకున్నారు. ముంపు బారిన పడ్డ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం కోసం అధికార యంత్రాంగం పడవలను ఏర్పాటు చేసినా ఆ సమయంలో వరద ఉధృతి ఎక్కువగా ఉండటం వల్ల పడవల్లో తరలించే విషయంలో ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆ సమయంలో ఆంధ్రా సిమెంట్ కంపెనీ ఆవరణలో నాలుగు అడుగుల మేర నీరు నిలిచింది.
 
ఆ సమయంలో అక్కడ కంపెనీలలో పని చేసే వర్కర్లు మాత్రం సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు. ఆ సమయంలో వచ్చిన వరద వల్ల రైల్వే కాలనీ జలమయం అయింది. రిజర్వాయర్ కోసం అప్పట్లో రైతులే ఎకరానికి 15 రూపాయల చొప్పున విరాళం ఇవ్వడానికి ముందుకొచ్చారని సమాచారం. ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో ఉన్న సమయంలోనే 1941 - 45 సంవత్సరాల మధ్య బుడమేరు పై రిజర్వాయర్ నిర్మాణానికి శాస్త్రీయ పరిశీలన జరిగింది.


మరింత సమాచారం తెలుసుకోండి: