తెలంగాణ ప్రాంతంలో ఎక్కువ శాతం వరదల వల్ల హైదరాబాద్ జనాలు ఇబ్బంది పడుతూ ఉంటారు. కాసింత వర్షం పడిన డ్రైనేజీ సిస్టం కరెక్ట్ లేకపోవడం వల్లనో , చెరువులు ఎక్కడికక్కడికి కబ్జా కావడం వల్లనో , మరికొన్ని అనేక కారణాల వల్ల హైదరాబాద్లో కాస్త వర్షం పడినా కూడా రోడ్లపై అధిక మొత్తంలో నీరు రావడం ,  ప్రజలు ఇబ్బందులు పడడం లో తట్టు ప్రాంతాలు నీటిలో మునిగి పోవడం ఇలాంటి పరిస్థితులు చూస్తూ ఉంటాం. ఇక తెలంగాణలో హైదరాబాద్ తర్వాత అలాంటి పరిస్థితి ఎక్కువగా వరంగల్ నగరంలో కనబడుతూ ఉంటుంది.

వరంగల్లో ఇప్పటికే అనేక సార్లు వరదలు వచ్చి జనాలు అనేక ఇబ్బందులు పడిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. ఇప్పటికి కూడా కాసింత వర్షం పడింది అంటే చాలు వరంగల్ ప్రజలు భయభ్రాంతులవుతూ ఉంటారు. ఎక్కడ ఆ వర్షం పెరిగి పెరిగి పెద్దదవుతుందో , ఆ వర్షాలు పెరగడం వల్ల వరదలు రావడం , లో తట్టు ప్రాంతాలు మునగడం , రోడ్ల పైకి నీరు రావడం , ఆ నీటి ద్వారా రాకపోకలు బంద్ కావడం ఇలా ఏ సమస్యల్లో చిక్కుకుంటామో అని వరంగల్ ప్రజలు వర్ష కాలం వచ్చి వర్షాలు పడుతున్నాయి అంటే చాలు బిక్కు బిక్కుమంటూ జీవనాన్ని సాగిస్తూ ఉంటారు.

మరి ఇప్పటికే వరంగల్ ప్రజలు అనేక సార్లు వరద ముంపులో గురి అయిన సందర్భాలు ఉన్నాయి. కొన్ని సంవత్సరాల క్రితం భారీ ఎత్తున వరంగల్లో వరదలు రావడంతో అక్కడి ప్రజలు అనేక కష్టాలను ఎదుర్కొన్నారు. ప్రస్తుతం కూడా వరంగల్ ప్రాంతంలో భారీగానే వర్షాలు కురుస్తున్నాయి. దానితో వరంగల్ ప్రాంతం ప్రస్తుతం కూడా వరద కష్టాల్ని ఎదుర్కొంటుంది. అక్కడి ప్రజలు కూడా అనేక కష్టాలను ఎదుర్కొంటున్నారు. ఇలా తెలంగాణ ప్రాంతంలో హైదరాబాద్ తర్వాత వరంగల్ నగరాన్ని వరదలు ఎక్కువగా పట్టి పీడిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: