-- కళ్ళముందే కరాళనృత్యం చేసిన తుఫాన్.
- గజగజ వణికించిన గాలులు.
- కోట్లాది ఆస్తుల నష్టం.

 తుఫాన్లు తీరాలు దాటాయి అంటే  సముద్ర తీర ప్రాంతాల్లోని ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతారు. ఎప్పుడు తీరం దాటి ఎలాంటి బీభత్సం సృష్టిస్తుందో చెప్పలేం. అలాంటి తుఫాన్లు ఇప్పటివరకు ఎన్నోసార్లు ప్రజలను తీవ్ర నష్టం చేశాయి. అలా  విలయతాండవం సృష్టించిన తుఫాన్లలో  హుదూద్ తుఫాన్ ఒకటి. ఈ తుఫాన్ వల్ల ఉత్తరాంధ్ర ప్రాంతం మొత్తం  తుడిచిపెట్టుకుపోయినట్టు అయిపోయింది. వందలాదిమంది మరణించారు. లక్షలాది ఎకరాల్లో పంట నష్టం.  మొత్తానికి 8000 కోట్ల నష్టాలు  జరిగాయని అధికారులు అంచనా వేశారు. అలాంటి ఉదు ఉదు తుఫాన్ అక్టోబర్ 2014లో  తూర్పు భారతదేశం మరియు నేపాల్ లో విపరీతమైన నష్టంతోపాటు, ప్రాణ నష్టం కూడా కలిగించింది. అండమాన్ మహాసముద్రంలో ఏర్పడినటువంటి ఈ తుఫాన్  అక్టోబర్ 9 2014లో తీవ్రమైన తుఫానుగా మారింది. అక్టోబర్ 12న ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం సమీపంలో  తీవ్రమైన నష్టం కలిగించింది.

 హుద్ హుద్ నష్టాలు:
హుద్ హుద్ తుఫాన్ విలయతాండవం సృష్టించి పది సంవత్సరాలు జరిగింది. కళ్ళలేదుటే ఉత్తరాంధ్ర మొత్తం కొట్టుకుపోయింది. ఈ తుఫాను దాటికి ఎనిమిది వేల కోట్ల నష్టం జరిగింది. మొత్తం 2000 కోట్ల మీద ఉద్యానవనాలు, రోడ్లు, వ్యవసాయ భూములకు  నష్టం వాటిల్లింది. అంతేకాకుండా వాణిజ్య కేంద్రాలు, దుకాణాలు  పూర్తిగా ధ్వంసం అయ్యాయి. ఏపీడిసిఎల్ విద్యుత్ సంస్థ తుఫాను కారణంగా  800 నుంచి 900 కోట్లను నష్టం వచ్చింది. ఈ తుఫాన్ వల్ల విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలు దాదాపు 20 రోజులపాటు అంధకారంలోనే ఉన్నాయి. విద్యుత్ స్తంభాలు, వైర్లు అన్ని తెగిపోయాయి. మొత్తం వేలాదిమంది కార్మికులు పనులను పునరుద్ధరించి    మళ్లీ సెట్ అయ్యేలా చేశారు. ఇవే కాకుండా విశాఖపట్నం విమానాశ్రయం కూడా చాలా వరకు దెబ్బతిన్నది.


వందలాది రైళ్లు రద్దు అయిపోయాయి. దాదాపు నెల రోజులపాటు విద్యాసంస్థలు బంద్ అయిపోయాయి. కనీసం ప్రజలకు తిండి లేని పరిస్థితి ఏర్పడింది. కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతిన్నది. ఈ తుఫాను దాటికి  మొత్తం వందలాదిమంది ప్రజలు మరణించారు. ఇండ్లు కూలిపోయి వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. 2014లో ఈ తుఫాను సృష్టించినటువంటి విలయతాండవం వల్ల  ఉత్తరాంధ్ర కోలుకోవడానికి చాలా టైం పట్టింది. అలాంటి హుద్ హుద్ తుఫాన్  ఏపీని తాకి పది సంవత్సరాలు పూర్తయింది. ఇప్పటికీ తుఫాన్ గురించి చెబితేనే విశాఖపట్నం ప్రజలు ఉలిక్కిపడతారు అంటే అది ఎంతటి విలయతాండవం సృష్టించిందో మనందరం గమనించవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: