- పొంగి పొర్లిన వాగులు వంకలు
- నీట మునిగిన వందలాది గ్రామాలు.


 తుఫాన్లు వస్తున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తే చాలు సముద్ర తీర ప్రాంతాల్లోని ప్రజలందరికీ  గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. ఎప్పుడు తుఫాను ఉధృతంగా మారి, వారిని కాటేస్తుందో తెలియని పరిస్థితిలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ బతుకుతారు. అలా తుఫాన్ ల దాటికి ఇప్పటికే ఏపీలో అనేక నష్టం జరిగింది.  వేలాది ఎకరాలు పంట నష్టం, వేలాదిమంది మరణించారు. మరికొందరు నిరాశ్రయులయ్యారు. అలా విలయతాండవం సృష్టించిన తుఫాన్లలో  నివర్ తుఫాన్ కూడా ఒకటి. ఈ తుఫాన్ కడపను అల్లకల్లోలం చేసింది. మరి నివర్ తుఫాన్ వల్ల కడపలో జరిగిన నష్టం ఏంటి వివరాలు ఏంటో చూద్దాం.

 నివర్ నష్టాలు:
  నీవర్ తుఫాన్ వల్ల భారీ వర్షాలు కురిసి కడప నగరం మొత్తం ముంపు బారిన పడింది. విపరీతమైనటువంటి వర్షాల వల్ల బుగ్గవంక ప్రాజెక్టు గేట్లు ఎత్తేశారు.  దీంతో ఒక్కసారిగా వచ్చిన వరదల వల్ల వేలాదిమంది ఇండ్లలోకి   నీళ్లు చేరిపోయాయి. బాలాజీ నగర్, రవీంద్ర నగర్, గుర్రాలగడ్డ, పాత బస్టాండ్,  నాగరాజుపేట, అల్మాస్ పేట, తదితర ప్రాంతాలలోని ఇండ్లన్నీ నీటిలో మునిగిపోయాయి.  ఇవే కాకుండా కార్లు, బైకులు వరద నీటిలో చిక్కుకొని పూర్తిగా పాడైపోయాయి. బుగ్గ వంక నుంచి ఒక్కసారిగా 20,000 క్యూసెక్కుల నీరు రావడంతో కడప నగరం ఒక్కసారిగా అతలాకుతలమైంది. కొద్దిగా నీరు చేరడంతో రాకపోకలు బంద్ అయిపోయాయి.


ఇక ఈ ప్రాంతాలే కాకుండా రాయచోటి, రాజంపేట, రైల్వే కోడూరు, బద్వేలు, కమలాపురం, నియోజకవర్గం తుఫాన్ ప్రభావం వల్ల  భారీ వర్షాలు పడి వాగులు వంకలు పొంగిపొర్లి లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరిపోయింది. విపరీతమైన పంట నష్టం తో పాటు, ఎన్నో ఇండ్లు వరద దాటికి కూలిపోయాయి. విపరీతమైన నీరు వల్ల విద్యుత్ లైన్లు మొత్తం దెబ్బతిని ప్రజలు అంధకారంలో ఉన్నారు. అన్నమయ్య ప్రాజెక్టు నిండుకుండలా మారి ప్రమాద స్థాయికి చేరుకుంది. ఈ విధంగా తుఫాను దాటికి నది పరివాహక ప్రాంతాల్లోని ప్రజలంతా క్షణక్షణం భయంగానే గడిపారు. మొత్తం ఇండ్లలోకి ఆరడుగుల మేర నీరు చేరడంతో  వర్షం నీటిలోనే బిక్కుబిక్కుమంటూ బతికేశారు. ఈ విధంగా తుఫాను దాటికి వందలాది కోట్ల నష్టం జరిగి  ఎంతోమంది పేద ప్రజల బ్రతుకులను రోడ్డున పడేసిందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: